సినిమా రంగంలోకి గంటా ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

ganta srinivasa rao to turn producer
Highlights

ఇప్పటికే వ్యాపారాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గంటా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తారలకు ఆయన అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడని సమాచారం

గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషనల్ మినిష్టర్ గా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయాలతో పాటు ఆయనకు సినిమాల పాటల కూడా ఆసక్తి ఉంది. మెగాస్టార్ చిరంజీవితో అతడికి చక్కటి సాన్నిహిత్యం ఉంది. రాజకీయాల పరంగా ఇద్దరి పార్టీలు వేరైనా.. వారి మధ్య బంధాలు మాత్రం బలంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కూడా కనిపిస్తుంటాడు గంటా.

ఆయన అల్లుడు ప్రశాంత్ వైజాగ్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఆయన కుమారుడు హీరో కావాలని ప్రయత్నించినా సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లోకి గంటా ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే వ్యాపారాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గంటా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తారలకు ఆయన అడ్వాన్స్ లు కూడా ఇచ్చాడని సమాచారం.

ఈ క్రమంలో స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు మారుతిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలానే మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ సరైన క్లారిటీ లేదు. భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనతో నిర్మాణ సంస్థ మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలు చాలా ఉన్నాయి. మరి వీటన్నింటినీ నెట్టి గంటా ముందంజలో దూసుకుపోతారేమో చూడాలి!

loader