చిత్రం- జయదేవ్ తారాగణం- గంటా రవి, మాళవికా రాజ్ సంగీతం- మణిశర్మ దర్శకుడు- జయంత్ సి.పరాన్జీ నిర్మాత- కె.అశోక్ కుమార్ ఆసియానెట్  రేటింగ్- 2/5

కథ-

జయదేవ్(గంటా రవి) ఓ పోలీస్ సబ్ ఇనిస్పెక్టర్. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచే జయదేవ్ ఓ పోలీస్ అధికారి మర్డర్ కేసుకు సంబంధించి విచారణాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. తన నేర పరిశోధనలో లిక్కర్ మాఫియా డాన్ వినోద్ కుమార్ వల్లే ఈ పరిణామాలన్నింటికి కారణమని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతన్ని ఎలా డీల్ చేసాడు.. చివరకు హత్యలు చేయించే ఆ లిక్కర్ డాన్ కటకటాల పాలు ఎలా అయ్యాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు-

హీరో గంటా రవికి తొలి చిత్రం కావడంతో యాక్టింగ్ లో ఫర్వాలేదనిపించినా.. ఇంకా చాలా వరకు నటన పరంగా చేయాల్సింది ఉంది. ఒడ్డూ పొడుగూ బాగానే ఉన్న గంటా రవికి సీరియస్ రోల్స్ కరెక్ట్ గా సూటవుతాయని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ మాలవికా రాజ్ సినిమాలో గ్లామరస్ గా కనిపించడమే కాక ఆడియెన్స్ ను వీలైనంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక చాలా కాలం తర్వాత వినోద్ కుమార్ ఓ కీలకపాత్రలో నటించిన చిత్రం జయదేవ్.

ప్లస్ పాయింట్స్-

జయదేవ్ చిత్రానికి సంబంధించి.. ముఖ్యంగా ఫైట్స్ విషయానికొస్తే.. హీరో జయదేవ్ తను కనిపించకుండా విలన్లను చితకబాదే ఫైట్ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో పోలీసు అధికారులకు ఎలాంటి వేధింపులు ఉంటాయన్నది చూపించే ప్రయత్నం చేశారు. ఇక విచారణ చేసే సీన్లు కొన్ని ఆసక్తి కరంగా తెరకెక్కించారు.

మైనస్ పాయింట్స్-

కథ చాలా రొటీన్ గా ఉండటం చిత్రానికి ప్రధాన మైనస్ పాయింట్. ఇక చిత్రంలో పెద్దగా ట్విస్టులు గట్రా ఏమీ లేకపోవడం వల్ల తదుపరి ఏం జరగబోతుందనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కనిపించదు. ప్రేమించుకుందాం..రా లాంటి చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు జయంత్ ఇలాంటి ఓ చిత్రాన్ని తెరకెక్కించాడంటే నమ్మలేం. విలన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల హీరో అంతగా ఎలివేట్ కాలేదని చెప్పాలి.

ఇక హీరో తన ఉద్యోగం కోల్పోవడం, తిరిగి ఉద్యోగంలోకి చేరేందుకు పడ్డ శ్రమ అంతా పెద్దగా కన్విన్సింగ్ గా అనిపించదు. కొన్ని సీన్స్ ఎలివేట్ చేస్తే ఇంకా అద్భుతంగా వచ్చేవి. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పాలి.

గంటా రవి లాంటి హీరోకు తొలి పరచయంలోనే ఇలాంటి హెవీ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకోవాలనిపించిందో తెలియదు. ఓ మంచి ప్రేమ కథా చిత్రాన్నో లేక మరేదైనా.. ఆసక్తికరమైన కథనో ఎంచుకుని వుంటే బాగుండేది. రవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేసినా కథనం సరిగా లేకపోవడంతో ఆకట్టుకునే అంశాలు లోపించడం వల్ల చిత్రానికి పూర్తిగా మైనసస్ అయిందని చెప్పాలి.

సాంకేతిక నిపుణులు-

చిత్రం నిర్మాణ పరంగా పెద్దగా హై వేల్యూస్ తో కృషిచేసినట్లు కనిపించదు. ఇక సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫరవాలేదనిపించింది. కెమెరా పని తనం కూడా కొన్ని సీన్ల చిత్రీకరణ చూస్తే అద్భుతంగా పనిచేశారనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ లో కత్తెరకు మరింత పని చెప్పుంటే.. ఇంకా కొంత నిడివి తగ్గి బోర్ కొట్టకుండా అనిపించేది. ఇఖ రీమేక్ సినిమానే అయినా.. స్క్రిప్ట్ పక్కాగా రూపొందించుకున్నట్లుగా అనిపించదు.

చివరగా-

పోలీసు పాత్రలను అమితంగా ఇష్టంగా పడేవారికి నచ్చే జయదేవ్