`గేమ్‌ఛేంజర్` పాటల ఖర్చు వింటే షాకే, `డ్రింకర్ సాయి`గా ధర్మ రచ్చ, మల్లాది మెచ్చిన `హిచ్ కాక్` బుక్
రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` పాటల ఖర్చు షాకిస్తుంది. మరోవైపు `డ్రింకర్ సాయి`గా ధర్మ చేసిన రచ్చ, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్` పుస్తకం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
రామ్ చరణ్ నటిస్తున్న `గేమ్ ఛేంజర్` సినిమా గురించిన చర్చ ప్రారంభమైంది. ఈ మూవీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాలో హైలైట్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ లోడింగ్ అనేలా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో భారీ కటౌట్‌తో మరింత హైప్‌ని పెంచుతున్నారు. విజయవాడలో చరణ్ భారీ కటౌట్‌ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓక్రేజీ వార్త వినిపిస్తుంది. సినిమాలో ఐదు పాటలున్నాయి. వాటికి అయిన ఖర్చు షాకిస్తుంది. ఐదు పాటలకే ఏకంగా రూ.75కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు విజువల్‌గా గ్రాండియర్‌గా ఉన్నాయి. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వాటిలోని విజువల్స్ కట్టిపడేస్తుంది. పాటలు ఐదు విజువల్ వండర్‌లా ఉండబోతున్నాయని తెలుస్తుంది. శంకర్ అంటేనే విజువల్ గ్రాండియర్ కి పెట్టింది పేరు. `గేమ్ ఛేంజర్` చిత్రంలో దాన్ని వేరే స్థాయిలో చూపించినట్టు తెలుస్తుంది.
ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంటున్న `డ్రింకర్ సాయి` హీరో ధర్మ..
కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం `డ్రింకర్ సాయి` శుక్రవారం విడుదలైంది. సరికొత్త లవ్ స్టోరీగా ఈ మూవీ ఆకట్టుకుంటుంది. పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ఈ క్రమంలో కొత్త కుర్రాడు ధర్మ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. దీంతో ధర్మ గురించి, సినిమా గురించి టీమ్ మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.
`ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సినిమాలో ధర్మ ఇంట్రడక్షనే చాలా మాస్సివ్ గా ఉంది. డాన్స్ లు కూడా ఇరగదీశాడు. ఫ్రీ ఇంటర్వెల్ టైంలో హీరో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల చేత `కాంతారా` క్లైమాక్స్ లో వచ్చే అరుపులను గుర్తు చేసింది. పుష్ప ట్రాక్ చాలా బాగా పండింది. సినిమాలో బెస్ట్ సీన్లలో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. క్లైమాక్స్ కి అద్భుతంగా కనెక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్లో మోంటే షార్ట్స్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరో పర్ఫామెన్స్ అందరి హృదయాలకు చేరువైంది.
విజయవాడ విజువల్స్ అద్భుతంగా చూపించారు. డ్రింకర్ సాయి చిత్రం క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మహిళలను అందరి హృదయాలను కదిలించింది. హీరో ధర్మ డెబ్యూ సినిమా అయినప్పటికీ 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడిలా తెరపై అద్భుత ప్రదర్శనను కనబరిచారు. యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అలాగే కామెడీ ని కూడా ఇరగదీసాడు. క్లైమాక్స్ లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో ధర్మ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత కచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలతో మెప్పించడం ఖాయం` అని డ్రింకర్ సాయి టీమ్ వెల్లడించింది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'
దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి మల్లాది వెంకట కృష్ణమూర్తిని మెప్పించింది 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్. ఈ పుస్తకానికి ఆయన ముందుమాట రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని అభినందిస్తూ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు.
'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ, `ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవి. హిచ్‌కాక్ తీసినవి క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తన పేరును ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నారు. 'నేను సిండ్రెల్లా సినిమా తీస్తే... ప్రేక్షకులు శవం కోసం ఎదురు చూస్తారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హిచ్‌కాక్.
సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది కూడా హిచ్‌కాక్. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. పులగం చిన్నారాయణ, రవి పాడి లకు నా అభినందనలు. ఈ పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని ఆడియోలో పేర్కొన్నారు.
ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు భగవద్గీత, బైబిల్ వంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని హరీష్ శంకర్ అందుకున్నారు.
read more: రామ్ చరణ్‌లో ఉన్న పెద్ద బలహీనత బయటపెట్టిన ఎన్టీఆర్.. ర్యాగింగ్ వేరే లెవల్
also read: దేవర 2` స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్?.. గూస్ బంమ్స్ తెప్పించే స్టోరీ?