`దేవర 2` స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్?.. గూస్ బంమ్స్ తెప్పించే స్టోరీ?
ఎన్టీఆర్ ప్రస్తుతం `వార్ 2`లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. దీంతోపాటు `దేవర 2` కి సంబంధించిన గూస్ బంమ్స్ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ ఈ ఏడాది `దేవర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ స్టేట్స్ లో మామూలుగానే ఆడినా, నార్త్ లో మాత్రం బాగా ఆదరణ పొందింది. పెద్ద హిట్ అయ్యింది. డివైడ్ టాక్‌తోనూ ఈ సినిమా ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించిందంటే మామూలు విషయం కాదు. దీంతో `దేవర 2`పై అంచనాలు పెరిగాయి. క్యూరియాసిటీ పెరుగుతుంది.
`దేవర 2` షూటింగ్ అప్ డేట్..
ఇక `దేవర 2` ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఈ మూవీ ఉంటుందా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన అప్ డేట్ వినిపిస్తుంది. తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విషయం బయటకు వచ్చింది. `దేవర 2`కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. దర్శకుడు కొరటాల శివ టీమ్ దీనిపై వర్క్ చేస్తుందట. స్క్రిప్ట్ వర్క్ లో టీమ్ బిజీగా ఉందని తెలుస్తుంది. `దేవర` హిట్ కావడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలుంటాయి. దాన్ని మించి ఉండేలా పార్ట్ 2ని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం స్క్రిప్ట్ పరంగా గట్టిగా కూర్చుంటున్నారని సమాచారం.
`వార్ 2` షూటింగ్‌లో ఎన్టీఆర్..
మరి `దేవర 2` ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2` సినిమాలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఈ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తారక్ ది నెగటివ్ రోల్ అని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి `డ్రాగన్` అనే పేరు వినిపిస్తుంది.ఈ సినిమా కూడా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవి ఎప్పుడు పూర్తవుతాయి? `దేవర 2` ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ విషయంలో తారక్ మాస్టర్ ప్లాన్ వేశారట.
`డ్రాగన్`తోపాటు `దేవర 2`..
త్వరలోనే `వార్ 2` షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ దీన్నుంచి రిలీఫ్ అవుతారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే `దేవర 2` షూటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట తారక్. ఈ మేరకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారట. ఈ క్రమంలోనే `దేవర 2` షూటింగ్ కి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ఈ మూవీని కూడా జులైలో ప్రారంభిస్తారట. ఆ లోపు ప్రశాంత్ నీల్ `డ్రాగన్` చిత్రీకరణ చాలా వరకు కంప్లీట్ చేయబోతున్నారట. మేకోవర్ కి సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయితే, మిగిలినది నెమ్మదిగా చేసుకోవచ్చు. ఆ వెంటనే `దేవర 2`ని ప్రారంభించాలనుకుంటున్నారట. అయితే ఇప్పటికే కొంత భాగం పార్ట్ 2 షూటింగ్ చేశారట. అది కూడా కొంత ఈజీ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా ఎన్టీఆర్ టైమ్ వేస్ట్ చేయకుండా ఏకకాలంలో రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్నట్టు సమాచారం.
`దేవర 2`లో మూడో ఎన్టీఆర్ కనిపిస్తాడా?
`దేవర` సినిమాలో తండ్రి(దేవర) చనిపోయినట్టు చూపించారు. క్లైమాక్స్ లో కొడుకు వర కూడా చనిపోయినట్టు చూపించారు. `దేవర 2`లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు చూపించబోతున్నారని తెలుస్తుంది. సముద్రంలో ఫైట్ హైలైట్‌గా ఉంటుందని, దేవర ఏమయ్యాడు? కొడుకే తండ్రిని ఎందుకు చంపేశాడు? అనేది చూపించబోతున్నారట. అలాగే తెరవెనుక వర చేసిన సాహసాలను చూపిస్తారని తెలుస్తుంది. దీంతోపాటు మరో గూస్ బంమ్స్ అప్ డేట్ వినిపిస్తుంది. ఇందులో తాత ఎన్టీఆర్ కూడా కనిపించే ఛాన్స్ ఉందట. బ్రిటీష్‌తో పోరాడిన తాత ఎన్టీఆర్ పాత్రని కూడా చూపించే అవకాశం ఉందని? ఆయన పాత్ర ఒక ఎపిసోడ్‌లో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్‌గానే ఉంది? ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది? నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టుగా ఉంటే మాత్రం `దేవర 2` సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని, `పుష్ప2`, `బాహుబలి 2`, `దంగల్` రికార్డులన్నీ బ్రేక్ కావడం ఖాయమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`దేవర` కాస్ట్ అండ్ క్రూ..
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం(దేవర, వర) చేసిన `దేవర` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. వరకు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదలైన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. హరి ప్రొడక్షన్‌లో కీలకంగా ఉన్నారు. ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే `దేవర 2` 2027లో విడుదలయ్యే అవకాశం ఉందట.