టాలీవుడ్ కు మరో హీరో.. సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు..

galla jayadev son to enter tollywood
Highlights

  • సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో
  • హీరోగా ట్రై చేస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్
  • ఇప్పటికే ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్న మహేష్ మేనల్లుడు

తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాల పాటు సూపర్ స్టార్ గా నిలిచిన స్టార్ అంటే కృష్ణనే. ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంటరయ్యాడు. ఈ తర్వాత అదే కుటుంబం నుంచి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి మరో నటుడు సినీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇంతకీ కృష్ణ గారి కుటుంబం నుంచి వస్తున్న హీరో ఎవరంటే.. కృష్ణ కుమార్తె పద్మావతి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ల కుమారుడు గల్లా అశోక్. వచ్చే ఏడాది హీరోగా రావాలనుకుంటున్న గల్లా అశోక్ తండ్రి గల్లా జయదేవ్.. పలువురి దర్శకుల నుంచి కథలు కూడా వింటున్నాడట.

 

అయితే ఈ సినిమాను మహేశ్ సొంత బ్యానర్‌లో ఉంటుందా లేక గల్లా జయదేవ్ బ్యానర్‌లో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. గల్లా అశోక్ కోసం.. గల్లా యువ సైన్యం పేరుతో ఒక అభిమాన సంఘం కూడా వెలిసింది. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ తన మామయ్యలాగా సినిమా రంగంలో రాణించాలని ఆశ పడుతున్నాడు. దాంతో హీరో అయ్యేందుకు అవసరమైన అంశాల్లో అశోక్ కు చాలా రోజుల ముందే ట్రైనింగ్ మొదలెట్టేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైనింగ్ అంతా ఓ కొలిక్కి రావడంతో అతడిని హీరోగా లాంచ్ చేసే పనులు మొదలెట్టారు.

 

పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు అశోక్ ను లాంచ్ చేసే బాధ్యతలు అప్పగించబోతున్నారు. అశోక్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలన్నది ఇంకా డిసైడ్ అవలేదు. కొత్త డైరెక్టర్ తో సినిమా త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందట.

 

ఇక మహేష్ సోదరి మంజుల కూడా హీరోయిన్ గా రాణించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనక్కు తగ్గింది. అయితే ఆమె కూతురు జాన్విని వెండితెరకు పరిచయం చేస్తోంది.

loader