వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా మార్చిన సంగతి తెలిసిందే. బోయసామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా టైటిల్ ని మార్చారు. 'గద్దలకొండ గణేష్' పేరుతో శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంది ఈ చిత్రం. సూపర్ హిట్ టాక్ తో సినిమా దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు రూ.4.7 కోట్ల వసూళ్లు రాబట్టింది

ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్.. 
నైజాం...................... రూ. 1.6 కోట్లు

సీడెడ్....................... రూ. 60 లక్షలు

యూఏ......................రూ. 60 లక్షలు

వెస్ట్............................రూ. 50 లక్షలు

ఈస్ట్........................... రూ. 50 లక్షలు

కృష్ణ........................... రూ. 30 లక్షలు

గుంటూరు................ రూ. 45 లక్షలు

నెల్లూరు.................... రూ. 15 లక్షలు

మొత్తంగా సినిమా రూ.4.7 కోట్లను వసూలు చేసింది. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘జిగర్తాండ’ సినిమాకు ‘గద్దలకొండ గణేశ్’ రీమేక్‌గా వచ్చింది. వరుణ్ తేజ్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. తమిళ నటుడు అథర్వా మురళి కీలక పాత్రను పోషించారు. 

గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ!