గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ!

First Published 20, Sep 2019, 1:47 PM

ప్రేమ కథలు, సాఫ్ట్ రోల్స్ పోషిస్తూ వస్తున్న వరణ్ తేజ ఈ సినిమా కోసం ఒక్కసారిగా తన లుక్ ని పూర్తిగా మార్చి కనపడగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారు.దానికి తోడు తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ కావటం, దానికి హరీష్ శంకర్ డైరక్టర్ కావటం అనేది సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 

(Review By---సూర్య ప్రకాష్ జోశ్యుల) ప్రేమ కథలు, సాఫ్ట్ రోల్స్ పోషిస్తూ వస్తున్న వరణ్ తేజ ఈ సినిమా కోసం ఒక్కసారిగా తన లుక్ ని పూర్తిగా మార్చి కనపడగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారు.దానికి తోడు తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ కావటం, దానికి హరీష్ శంకర్ డైరక్టర్ కావటం అనేది సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దానికి తోడు టైటిల్ వివాదం సినిమాని ఎప్పుడూ వార్తల్లో ఉంచేలా చేసింది. ఇవన్ని కలిపి ఏంటీ సినిమా అనే ఎక్సపెక్టేషన్స్ పెంచాయనటంలో సందేహం లేదు. అయితే వాటిని ఈ సినిమా అందుకోగలిగిందా..తమిళ వెర్షన్ ని ట్రూ రీమేక్ గా ఫాలో అయ్యారా..మార్పులు ఏం చేసారు...వరుణ్ తేజ ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారా వంటి విశేషాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి : గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ) ఓ గ్యాంగస్టర్. అభిలాష్ (అధర్వ) ఇంట్లో వాళ్ల చేత ఒక ఏడాది లో తెరపై సినీ డైరక్టర్ గా పేరు చూపిస్తానని ఛాలెంజ్ చేసి ఆ పనిలో ఉంటాడు. ఈ క్రమంలో అతనికో ఆలోచన వస్తుంది. గ్యాంగస్టర్ కథని తెరకి ఎక్కిస్తే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. అయితే అది రియల్ లైఫ్ గ్యాంగస్టర్ జీవిత సంఘటనలతో అయితే బాగుంటుందని భావిస్తాడు. ఆ క్రమంలో అతనికి గద్దలకొండ గణేష్ గురించి తెలుస్తుంది. అయితే తన జీవితంపై సినిమా తీస్తానంటే ఏ గ్యాంగస్టర్ అయినా ఒప్పుకుండాటా...లేదు కదా..అందుకే సీక్రెట్ గా అతని జీవితాన్ని పరిశీలించి సీన్స్ రాసుకోవాలనుకుంటాడు. అందుకోసం గణేష్ కు దగ్గరైన బుజ్జమ్మ (మృణాలిని)ని మచ్చిక చేసుకుంటాడు. ఆమె ద్వారా తన పని కానివ్వాలనుకుంటాడు. కానీ ఎంతకాలం అలా చేయగలడు..ఏదో ఒక రోజు బయిటపడుతుంది. అదే జరిగింది. తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని తెలుసుకున్న గణేష్... అభిలాష్ ని ఏం చేసాడు. సినిమా తియ్యాలన్న అతని అభిలాష తీర్చాడా...అతని జీవితంలో సినిమా తీయదగినన్ని విశేషాలు ఉన్నాయా, అతని ప్లాష్ బ్యాక్ ఏమిటి, ఈ కథకు వాల్మీకి టైటిల్ కు సంభంధం ఏమిటి వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ,కథనం : ఫస్టాఫ్ మొత్తం వరుణ్ తేజ, అధర్వ పాత్రల పరిచయం, అధర్వ అవసరం ఎస్టాబ్లిష్ చేయటానికే సరిపోయింది. ఇంటర్వెల్ సైతం అధర్వ ఇరుకున పడటంపై వస్తుంది. ఇక సెకండాఫ్ లో అధర్వ, వరుణ్ తేజ స్నేహం చేయటం, వరుణ్ తేజని పడేయటం కోసం అతన్నే హీరోగా పెట్టి సినిమా ప్లాన్ చేయటం, అప్పుడు వరుణ్ తేజ తన ప్లాష్ బ్యాక్ ని చెప్పటం వంటి వాటితో నిండిపోతుంది. దాంతో సినిమా వరసగా సీన్స్ జరుగుతూంటాయి కానీ కథ కదిలినట్లు కనిపించదు. అందుకు కారణం ..ఎక్కడా వరుణ్ తేజ పాత్ర సమస్యలో పడకపోవటమే.దాంతో మనకు సినిమాపై ఇంట్రస్ట్ తగ్గిపోతుంది.

అయితే హరీష్ శంకర్ తన మార్క్ కామెడీతో ఆ సమస్యను దాటే ప్రయత్నం చేసారు. కానీ అది కొంతవరకే వర్కవుట్ అయ్యింది. ఇక సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మనకు కథ ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజుని గుర్తు చేస్తూంటాయి. ఓ రౌడీ ...ఓ డైరక్టర్ ని ఇబ్బంది పెడుతూ తనకు కావాల్సినట్లుగా సినిమా చేయించుకోవటం అనేది కిక్ ఇవ్వలేదు.

వాస్తవానికి తమిళ జిగర్తాండ (ఈ సినిమాకు మూలం) కథ ఓ డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో చెప్పబడింది. ఆ పాత్రను బాబీ సింహా చేసారు. ఆయనకు ఆ సినిమాకు గానూ జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. డైరక్టర్ గా సిద్దార్ద చేసారు. దాంతో మనకు సిద్దార్ద సమస్యలో పడటం, అతను చివరకు గెలిచాడా లేదా అన్నదే హైలెట్ అవుతూ వస్తుంది. అదే తెలుగుకు వచ్చే సరికి అధర్వ డైరక్టర్ పాత్రలో, వరుణ్ తేజ గ్యాంగస్టర్ గా కనపించారు.

ఇక్కడ గ్యాంగస్టర్ వైపు నుంచి కథ నడిపుతూ అతన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేసారు. ఎందుకంటే మనకు వరుణ్ తేజ హీరో కాబట్టి. అతనిలో మార్పుని క్లైమాక్స్ గా తీసుకున్నారు. అయితే కథ మూలం ఎక్కడికీ పోదు కదా..ఎంత వరుణ్ తేజ వైపు నుంచి కథ చెప్పినా, మనం అధర్వ పాత్రనే ఫాలో అవుతాం. అతనే కాంప్లిక్ట్ లో పడటంతో అతని వైపే మనం ఉంటాం. అదే ఈ సినిమాకు మైనస్ గా మారింది.

ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల కలిసొచ్చిందేంటి : ఒరిజనల్ జిగర్తాండ సినిమాలో లేని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఈ సినిమాలో పెట్టారు. ఎందుకంటే వరుణ్ తేజ వంటి హీరోకు హీరోయిన్ కావాలి. కాబట్టి ఆ కథను అల్లారు. కానీ నిజానికి ఈ కథ కొంచెం కూడా ఆ ప్లాష్ బ్యాక్ ని డిమాండ్ చేయదు. ప్లాష్ బ్యాక్ లో వచ్చి పూజ హెడ్గే బాగుంది. వెల్లువచ్చే గోదారమ్మ పాట చిత్రీకరణ బాగుంది. రెట్రో లుక్ లో వరుణ్ తేజ బాగున్నాడు. కానీ కథకు అవసరం లేని సీన్స్ కావటంతో అలా వచ్చి ఇలా వెళ్లి పోయాయనిపించాయి.

సినిమాలో ఏకైక హైలెట్ : సినిమాలో చెప్పుకోదగ్గ హైలెట్ ...వరుణ్ తేజ కటట్ మాత్రమే. అతను ఆ పాత్రకు తగ్గ ఆహార్యం, వాచకంతో దూసుకుపోయాడు. తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ..ఒరిజనల్ తో చేసిన బాబీ సింహాతో పోల్చకూడదు. పూర్తిగా మాస్ గెటప్ లుక్ తో అదరకొట్టాడు. అయితే ఈ గెటప్ చూసి ఎక్సపెక్టేషన్స్ పెంచుకుంటే మాత్రం చేతులెత్తేస్తాడు. గెటప్ కు కథ కలిసిరాలేదు.

పూజ గెస్ట్ కు ఎక్కువ.. : ఇక పూజ హెడ్గే విషయానికి వస్తే ఆమె పాత్ర అతి చిన్నది. అలా వచ్చి ఓ పాటలో కనపడి, కొన్ని సీన్స్ లో కనపడి..మెరుపుతీగలా మాయిమైపోతుంది. ఫస్టాఫ్ లో అసలు ఆమె ఇంట్రీనే లేదు. ఆమె కథకు అవసరమూ లేదు అని సినిమా చివర్లో అనిపిస్తే అది మీ తప్పు కాదు. అయితే ఏ మాటకు ఆ మాట...సినిమాలో వరుణ్ తేజ, పూజ కెమిస్ట్రీ మాత్రం అదిరింది. అయితే వెల్లువచ్చే గోదారమ్మ పాటలో శ్రీదేవి గ్రేస్ తో పోల్చనంత సేపు ఆమె అద్బుతమే. మిగతావాళ్లలో ముని మాణిక్యం ..యాక్టింగ్ టీచర్ గా బ్రహ్మాజీ బాగా నవ్వించాడు.

టెక్నికల్ గా .. : తన కెరీర్ లో క్లాస్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ మొదటి సారి మాస్ సినిమాకి చేసాడు. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు కలిసొచ్చాడు. ముఖ్యంగా “వాకా వాకా” అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు మరో బలం సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ విషయానికి వస్తే లెంగ్త్ ఇంకా తగ్గిస్తే బాగుండేది. దాదాపు మూడు గంటలు సినిమా ..ఇబ్బందే. అలాగే సెకండ్ హాఫ్ లో ఫ్లో లేదు.

డైలాగ్స్ : హరీష్ శంకర్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది డైలాగ్స్ గురించి ... ఇయాల్టి నుంచీ ఎలా చంపాలో కాదు, ఎలా బ్రతకాలో ఆలోచించుకోమను...   అందుకే పెద్దోళ్లు చెప్రిండ్రు, నాలుగు బుల్లెట్లు సంపాదిస్తో రెండు ఖర్చు పెట్టాలే, రెండు దాచుకోవాలే..... ఆడిషన్ టెస్ట్ లో వరుణ్ తేజ చేత రామ్ చరణ్ ..షేర్ ఖాన్ డైలాగు చెప్పించారు..బాగుంది

ఫైనల్ థాట్ : గెటప్ అదిరింది..రీమేక్ తడబడింది

రేటింగ్ : 2.5/5

రేటింగ్ : 2.5/5

loader