బిగ్ బాస్ 2కి కొత్త చిక్కులు

gaana icon of the Day  FEFSI trouble for Bigg Boss Tamil
Highlights


షాక్ లో బిగ్ బాస్ నిర్వాహకులు

ప్రముఖ  టీవీ రియాల్టీ షో ‘ బిగ్ బాస్’ అన్ని భాషల్లోనూ అదరగొడుతూ దూసుకుపోతోంది. మొదట హిందీలో ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకుంది. తెలుగు బిగ్ బాస్ 2 షోకి హీరో నాని  హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తమిళ బిగ్ బాస్ కి విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ తమిళ బిగ్ బాస్ కి ఇప్పుడు సమస్యలు పుట్టుకువచ్చాయి. ఈ సెట్ ని పూందమల్లి సమీపంలో ఏర్పాటు చేశారు. దాదాపు 60 కెమెరాలను ఏర్పాటు చేసి చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే బిగ్‌బాస్‌ సెట్‌ నిర్మాణం, ఇతర పనులకు ఫెప్సీ కార్మికులను వినియోగించుకోకుండా, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులచే పనులు చేయిస్తున్నట్లు సమాచారం. 

దీనిపై ఆగ్రహించిన ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణితో పాటు 25 మంది కార్మికులు బిగ్‌బాస్‌ సెట్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌కే సెల్వమణి విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌ తొలిభాగం చిత్రీకరణ సమయంలో 50 శాతం మంది ఫెప్సీ కార్మికులను వినియోగించుకున్నారు. కానీ ఈసారి కమల్‌ హాసన్‌తో పాటు మొత్తం 41 మంది మాత్రమే ఇక్కడివారు ఉన్నారు. మొత్తం ఉత్తరాది రాష్ట్రాల కార్మికులే పనిచేస్తున్నారు. దీన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో కమల్‌ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. 29వ తేదీలోపు నిర్వాహకులు చర్యలు తీసుకోకుంటే 30న భారీ స్థాయిలో ఆందోళన చేపడతాం’’ అని  ఆయన హెచ్చరించారు. 
 

loader