ఈ కామాంధులని ఏం చేశారో తెలుసా..?

First Published 26, Mar 2018, 2:24 PM IST
Four rapists Paraded on streets by police
Highlights
ఈ కామాంధులని ఏం చేశారో తెలుసా..?

భోపాల్ లో నలుగురు రేపిస్టులకు పోలీసులు, స్థానికులు గట్టి గుణపాఠం చెప్పారు. 20 ఏళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వీరిని వీధుల్లో తిప్పుతూ, చెప్పుదెబ్బలు కొడుతూ పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు. కాలేజీ విద్యార్థిని అయిన బాధితురాలిని ఆమె సీనియర్ స్టూడెంట్ ఒకడు తన రూమ్ కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.

ఏదో విషయమై తన మాట విననందుకు ఇలా ” శిక్షిస్తున్నా ” నంటూ తన ఫ్రెండ్స్ ముగ్గుర్ని కూడా ఇందుకు  ప్రోత్సహించాడట. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఈ నలుగురు రేపిస్టులనూ అరెస్ట్ చేసి ఈ ” శిక్ష ” విధించి కోర్టులో హాజరు పరిచారు. క్రిమినల్స్ కి ఇలాంటి వింత శిక్షలు విధించడం వల్ల బాధితురాళ్ళలో భయం పోతుందని, ఫిర్యాదు చేసేందుకు వెనుకాడబోరని పోలీసు అధికారులు అంటున్నారు.

loader