Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో బాహుబలి-2 ఐదు షోలకు అనుమతి

బాహుబలి-2 తెలంగాణాలో అయిదు షోలు, మొదటి 15 రోజుల్లో కేవలం ఆన్ లైన్ లోనే టికెట్ల విక్రయం

five shows for bahubali in Telangana

బాహుబలి చిత్రం అయిదు షోలు ప్రదర్శించేందుకు  తెలంగాణా ప్రభుత్వం  సుముఖత చూపింది.

 ఈ విషయాన్ని ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  వెల్లడించారు.కొద్ది సేపటి కిందట చిత్ర నిర్మాతలు మంత్రిని కలిసి  ఈమేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 28 న బహుబలి -2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్బంగా చిత్రయూనిట్ కు మంత్రి  శుభాకాంక్షాలు తెలిపారు.

వంద ఏళ్ల చలన చిత్ర చరిత్రలో బహుబలి లాంటి చిత్రాలు రావడం సంతోషకరమని అంటూ బహుబలి చిత్రానికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహయం అందిస్తుందని శ్రన.

5 వ షో కు ప్రభుత్వం అనుమతిని అడిగారు.తప్పకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తుందని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

అయితే, ఎట్టి పరిస్థితులో బ్లాక్ టికెట్లు అమ్మరాదని, అమ్మితే కఠన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా మొదటి 15 రోజులు అన్ లైన్ ద్వారానే టికెట్లు విక్రయించాలని కూడా సూచించారు.

దీనికి స్పందిస్తూ  మొదటి 15 రోజుల్లో అన్ని థియోటర్స్ లో అన్ లైన్ ద్వార టికెట్ల విక్రయాలు చేస్తామని బహబలి చిత్ర నిర్మాణ దేవినేని ప్రసాద్ హామీ ఇచ్చారు.

బహుబలి-2 చిత్రన్ని చూడాలని మంత్రికి  విజ్జప్తి చేశారు.

ప్రభుత్వం అయిదు అటలు అడిపించేందుకు అనుమతి ఇవ్వడం సంతోషకరమని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios