హీరోయిన్ లావణ్య(lavanya tripathi) త్రిపాఠి బర్త్‌డే స్పెషల్ గా ఆమె నటిస్తోన్నసినిమా నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బర్త్ డే స్టార్ కు ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో హడావిడి చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripathi).. ఈ మధ్య రేసులో వెనుకబడింది. సినిమాలు అయితే చేస్తుంది కాని.. పెద్దగా ప్రభావం మాత్రం ఉండటం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోల సరసన సందడి చేసిన బ్యూటీ.. ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఉమెన్ ఓరియెంటెండ్ మూవీస్ చేయడానికి కూడా సై అంటున్న స్టార్ హీరోయిన్ బర్త్ డే ఈరోజు (15 డిసెంబర్).ఆమె బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు మూవీ టీమ్.
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా డైరెక్షన్ లో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రీసెంట్ గా ఓ మూవీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ‘హ్యాపీ బర్త్‌డే’(happy birthday) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు మూవీటీమ్. ఈ రోజు (బుధవారం) హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని మూనిట్ రిలీజ్ చేసింది.
Also Read : BALAYYA-RAJAMOULI : బాలయ్యతో రాజమౌళి..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య లీడ్ రోల్స్ చేస్తున్నఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ మూవీని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తూ కనిపించింది. టైటిల్ చుట్టూ గన్స్ చూపిస్తూ.. పక్కన ‘నో గన్, నో ఎంట్రీ’ అనే క్యాప్షన్ ను ఎలివేట్ చేస్తున్నట్టు ఉంది. ఈ పోస్టర్ ద్వారా ఇది ఏ టైప్ ఆఫ్ మూవీనో ఇట్టే అర్థమవుతోంది. టోటల్‌గా ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులకి మంచి పార్టీ రెడీ అవుతుందనేలా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ మూవీ నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె బర్త్‌డే రోజే.. ‘హ్యాపీ బర్త్‌డే’ టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రీసెంట్‌గానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ రానా ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేయబోతున్నారన్నారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతోంది. మంచి కాంబినేషన్ ఈ సినిమా కోసం సెట్ అయ్యింది... టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ మూవీకి కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ చేస్తున్నారు.
Also Read : Pushpa:ఆపరేషన్ జరిగిన భుజంపైనే ప్రెజర్, చాలా నొప్పి: బన్ని
