కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్‌గా... ఇలా మూడు కోణాల్లో కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్‌కే రెండు గంటల సమయం పట్టింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 17న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్వూలు ఇస్తున్నారు. అల వైకుంఠపురములో’ సినిమా పూర్తయ్యాక ‘పుష్ప’ మొదలుపెట్టా. 45 రోజుల్లో పుష్పరాజ్‌గా మారా. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డా. మేకప్ వేసుకునేందుకు 2 గంటలు, దాన్ని తీసేందుకు 40 నిమిషాల సమయం పట్టేది అంటూ తన కష్టం గురించి చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...పుష్ప సినిమాలో ఒక భుజం పైకి లేపి కనిపిస్తూ నటించాల్సి వచ్చింది. 2005, 2011లో నా భుజానికి గాయమైంది. ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఈ సినిమా కోసం అదే భుజంపైకి లేపి నటించాల్సి రావడంతో చాలా నొప్పి వచ్చేది అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.
అలాగే చాలా కాలంగా నా పాత్రలు చూస్తూంటే నాకే బోర్ కొట్టింది. మారాలని అనిపించింది. పుష్పరాజ్ అనేది ఓ కల్పితమైన పాత్ర. కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్‌గా... ఇలా మూడు కోణాల్లో కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్‌కే రెండు గంటల సమయం పట్టింది. తొలగించడానికి అర గంటపైనే పట్టేది. ఈ స్థాయి మేకోవర్‌తో నేనే సినిమా చేయలేదు. హాలీవుడ్‌లో ప్రాస్థెటిక్ మేకప్ ఎలా చేస్తారు? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమాతో తెలిసొచ్చింది.
యాస గురించి చాలా కసరత్తులే చేశా. స్క్రిప్ట్‌లో ఉన్న సంభాషణల్ని పలకడమే కాదు, సహజంగా ఓ మాటని రాయలసీమ యాసలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేంత పట్టు వచ్చేలా నేను కసరత్తులు చేశా. ‘పుష్ప’కి నా కెరీర్‌లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాని చూసి ఎవరెలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత నాలో ఉంది. నా కెరీర్‌లో తొలిసారి ఇలాంటి ఓ అభిప్రాయం కలిగింది అని చెప్పుకొచ్చారు.
Also read Pushpa:USA ప్రీమియర్స్ పరిస్దితి ఏమిటి?!
నేను, సుకుమార్ ఇది హిట్ కావాలని పనిచేశాం తప్ప, తను ఇదివరకు ఏం చేశాడో, నేను ఇదివరకు ఏం చేశానో అనే వాటి గురించి ఆలోచించలేదు. ఫహాద్ ఫాజిల్, రష్మిక తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం. రష్మిక చాలా అందమైన నటి. సమంత మాపై ఎంతో నమ్మకంతో ప్రత్యేక గీతం చేశారు. దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్ కలిసి మరోసారి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఛాయాగ్రాహకుడు క్యూబా ప్రత్యేకమైన కన్నుతో విజువల్స్‌ని చూశారా అనేలా ఉంటాయి సన్నివేశాలు.
Also read SUNIL-PUSHPA : ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవ్వాలని : సునిల్
