రామోజీరావు లాంటి అగ్ర నిర్మాత, వ్యాపారవేత్తపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. బాహుబలి సినిమా విషయంలో రామోజీరావు ఈనాడు పేపర్ మొత్తం దానికి సంబంధించిన వార్తలనే ప్రచురించాడు. సినిమా ప్రమోషన్స్ లో ఎంత చేయాలో అంతా చేశాడు. రామోజీరావు ఏమైనా సినిమాపై పెట్టుబడులు పెట్టాడా..? అనే రేంజ్ లో పబ్లిసిటీకు సహాయం చేశారు.

బాహుబలి షూటింగ్ దాదాపు రామోజీఫిలిం సిటీలోనే జరిగింది. అటువంటిది రాజమోజీరావుకి రాజమౌళి ఇప్పుడు అసలు పడడం లేదని టాక్. దీనికి కారణం ఆర్ధిక లావాదేవీలే అని తెలుస్తోంది. బాహుబలి సినిమా సెట్ వర్క్, ఫిలిం సిటీ ఖర్చులు మొత్తం బిల్లు దాదాపు రూ.90 కోట్లు చూపించారట. ఇంత వసూలు చేయడం రాజమౌళికి రుచించకపోవడం, పైగా చూపించిన లెక్కలలో తేడాలు ఉండడం సహించలేక తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలానే బాహుబలి రెండు భాగాల శాటిలైట్ హక్కులు ఈటీవీకే ఇస్తానని చెప్పిన రాజమౌళి చివరి నిమిషంలో మాట మార్చడం పట్ల వాళ్లు కూడా కోపంగానే ఉన్నారట.

ఈ విధంగా రాజమౌళి-రామోజీరావుల మధ్య గొడవలు మొదలయ్యాయని అంటున్నారు. ఇకపై రాజమౌళి తన సినిమాల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ బాహుబలి సినిమాకు సంబంధించి కొన్ని లెక్కలు తేలదని చెబుతున్నారు.