ప్రతి ఏడాది దక్షినాది చిత్ర పరిశ్రమలన్నింటికీ కలిపి ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్ లో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 65వ ఫిలిం ఫేర్ వేడుకల్లో బాహుబలి2 సినిమా అవార్డులన్నీ కొల్లగొట్టిందనే చెప్పాలి. 'అర్జున్ రెడ్డి' పాత్రలో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, ఫిదా సినిమాలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్ అవార్డు అందించారు. అవార్డుల వివరాలు.. 

ఉత్తమ చిత్రం : బాహుబలి 2 
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి 2) 
ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) 
ఉత్తమ నటి : సాయి పల్లవి (ఫిదా) 
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) : వెంకటేష్ (గురు సినిమా)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) : రితికా సింగ్ (గురు) 
ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి 2) 
ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి 2) 
ఉత్తమ నటి (తొలి పరిచయం) : కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) 
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి 2) 
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా)
ఉత్తమ గేయ రచయిత : ఎమ్ ఎమ్ కీరవాణి
జీవితకాల సాఫల్య పురస్కారం : కైకాల సత్యనారాయణ 
ఉత్తమ నేపథ్య గాయకుడు : హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) 
ఉత్తమ నేపథ్య గాయని : మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) 
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ (బాహుబలి 2)