- Home
- Entertainment
- Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
అఖండ 2 రిలీజ్ కి అడ్డంకులు తొలిగాయి. ఈ మేరకు మద్రాస్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో నిర్మాతలు అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అఖండ 2 రిలీజ్ వివాదం
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విషయంలో అభిమానుల తో పాటు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. మరి కొన్ని నిమిషాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి అనగా చిత్ర యూనిట్ సినిమాని వాయిదా వేసింది. ఉన్నపళంగా ప్రీమియర్ షోలు, సినిమా రిలీజ్ రద్దయ్యాయి. దీనితో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది.
నిర్మాతల కృషి ఫలించింది
అఖండ 2 రిలీజ్ ని అడ్డుకుంటూ ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో వారికి అనుకూలంగా అఖండ 2 రిలీజ్ ని ఆపివేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు సమస్యని పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డిసెంబర్ 5 నుంచి నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి 14 రీల్స్ ప్లస్ నిర్మాతల కృషి ఫలించింది.
అఖండ 2 రిలీజ్ కి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుతున్న సమాచారం మేరకు అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు, బయ్యర్ల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి కాబట్టి డిసెంబర్ 12నే సినిమాని రిలీజ్ చేయాలని అంటున్నారు.
అదొక్కటే సమస్య
డిసెంబర్ 12 రిలీజ్ డేట్ ని త్వరలోనే 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఒక్క సమస్య ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన అఖండ 2 వాయిదా పడడంతో ఓవర్సీస్ రిలీజ్ గందరగోళంగా మారింది. ఇప్పుడు డిసెంబర్ 12న రిలీజ్ అంటే 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే అక్కడ మళ్ళీ థియేటర్లు వెతుక్కోవాలి. రిలీజ్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.
టికెట్ రేట్ల కోసం నిర్మాతల ప్రయత్నాలు
ఇది మినహాయిస్తే అఖండ 2 డిసెంబర్ 12న రిలీజ్ కావడానికి అంతా సిద్ధం అని చెప్పొచ్చు. దీనితో నిర్మాతలు మరోసారి అదనపు టికెట్ ధరల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

