రామ్ సినిమా సెట్లో యంగ్ రైటర్ తో సీనియర్ టెక్నీషియన్ గొడవ!

fight between writer and cinematographer
Highlights

ప్రసన్న ఫ్రేమింగ్ విషయం, కలర్ స్కీమ్ వంటి విషయాలపై సినిమాటోగ్రాఫర్ కు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారట. దీంతో ఈగో హార్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ వెంటనే అతడిపై ఫైర్ అయినట్లు సమాచారం

సినిమా ఇండస్ట్రీలో సీనియర్లకు దక్కాల్సిన గౌరవం దక్కితే ఓకే లేదంటే.. అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతుంటారు. తమ పనిలో ఎవరైనా కలుగజేసుకొని సలహాలు, సూచనలు ఇస్తే గనుక వారు మరో విధంగా రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు రామ్ సినిమా సెట్ లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందని సమాచారం. దర్శకుడు త్రినాధరావు నక్కిన.. రామ్ హీరోగా 'హలో గురు ప్రేమ కోసమే' అనే సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కె చక్రవర్తి పని చేస్తున్నారు. గతంలో 'బొమ్మరిల్లు','పరుగు','నాన్నకు ప్రేమతో' వంటి హిట్ సినిమాలకు విజయ్ పని చేశారు. ఇక అసలు విషయంలోకొస్తే.. దర్శకుడు త్రినాథరావుకి యంగ్ రైటర్ ప్రసన్న బాగా క్లోజ్. సెట్ లో చాలా వరకు డైరెక్టర్ చేయాల్సిన పనులను ఆయన తరఫున ప్రసన్న చేస్తుంటాడని టాక్. వాళ్లకు అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు ఓకే.. కానీ ప్రసన్న ఫ్రేమింగ్ విషయం, కలర్ స్కీమ్ వంటి విషయాలపై సినిమాటోగ్రాఫర్ కు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారట.

దీంతో ఈగో హార్ట్ అయిన సినిమాటోగ్రాఫర్ వెంటనే అతడిపై ఫైర్ అయినట్లు సమాచారం. ఏమైనా చెబితే డైరెక్టర్ చెప్పాలి గానీ రైటర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన కలుగజేసుకొని కూల్ చేశారట. రీసెంట్ గా ఈ సినిమా సెట్ లోనే ప్రకాష్ రాజ్ హీరోయిన్ అనుపమ మీద కోప్పోడ్డారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు టెక్నీషియన్స్ మధ్య గొడవ జరగడం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి తెర వెనుక గొడవలతో సినిమా బాగానే వార్తల్లో నిలుస్తోంది.    

loader