ఫెమినా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హాల్ ఛల్ చేస్తోంది. తన అందాల ఆరబోయడానికి  సోషల్ మీడియా ని వేదికగా చేసుకుంది. ఎప్పుడు యక్టీవ్ గా ఉంటూ బోలెడు పోస్టులు పెట్టేసే మానుషి కి ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ లెక్క ఈమధ్యనే 3 మిలియన్ కు చేరాయి. ఈ విషయాన్ని తానే చెప్పుకుంటూ అందరికి థాంక్స్ అని చెప్తోంది.  వన్ పీస్ బికినీ వేసుకుని కొండల మధ్యలో పక్కకు చూస్తూ నవ్వుతున్న మానుషి ని చూస్తే కుర్రకారు మతులు పోయేలా లేదు. సినిమాలతో కాకపోయినా ఇలా సోషల్ మీడియాలో మానుషి ఎప్పుడు తన ఫాన్స్ కి కవ్విస్తూనే ఉంటుంది. ముఖంలో కళ, అందమైన ఆకృతి, మురిపించే నవ్వు, టాలెంట్ ఒక హీరోయిన్ కు కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నాయి. మరి ఈ భామ ఎప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై మెరుస్తుందో చూడాలి.