ఈ ఏడాది టాలీవుడ్ లో అతి బిగ్గెస్ట్ మూవీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం. ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకునిపోతుండడంతో ఫాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న తొలిచిత్రం ఇది. ఇప్పటికే పూజా కార్యక్రమాలని పూర్తి చేసుకుని ప్రిప్రొడెక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం తాజగా సెట్స్ పైకి వెళ్లే డేట్ ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.


దర్శకుడి త్రివిక్రమ్ పై అజ్ఞాతవాసి చిత్ర పరాజయం బాగానే పడింది. ఈ చిత్రం విషయంలో త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ప్రభావం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంపై అంతగా పడలేదని చెప్పొచ్చు. సినిమాపై ఉన్న అంచనాలు అలాగే ఉన్నాయి. అభిమానుల్లో కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. కానీ కొన్నితప్పని మార్పులని మాత్రం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చేస్తున్నారట. సంగీత దర్శకుడు అనిరుద్ ని ఈ చిత్రం నుంచి తప్పించినట్లు సమాచారం.


ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందని అని అటు ఫాన్స్, ఇటు సినీవర్గాల్లో ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. మార్చ్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం.


త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని త్రివిక్రమ్ బలంగా చూపించబోతున్నారట.
త్రివిక్రమ్ ఈ చిత్రంలో మరో అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ లోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసి ప్రత్యేకంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ కామెడీ పండిస్తే అభిమానులకు బోలెడంత వినోదం ఖాయం.