'రంగస్థలం' సూపర్‌ హిట్‌ కావాలని ఫ్యాన్స్ ఏంచేసారో తెలుసా...?

First Published 29, Mar 2018, 5:58 PM IST
fans prayers for rangasthalam to be a super hit
Highlights
'రంగస్థలం' సూపర్‌ హిట్‌ కావాలని హోమం

 

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న 'రంగస్థలం' సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయవంతం కావాలని ప్రస్తుతం శ్రీ గుంటూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత.. శ్రీ గణపతి ఉపనిషత్ పారాయణం, సహస్ర మోదక హోమం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కూడా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతిలో, అనంతరం శ్రీకాళహస్తిలో ఆయన పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ నీలకంఠ పశుపత హోమం కూడా చేశారు.    

 

loader