అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ కామెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అర్జున్ రెడ్డి అభిమానులు వేష‌దార‌ణని మార్చుకో.. ఎక్స్ పోజింగ్ ఆపేయ్.. అని సలహా

ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘ అర్జున్ రెడ్డి’. పలువురి ప్రశంసలు, విమర్శలతో ఈ చిత్రం టాలివుడ్ లో హాట్ టాపిక్ మారింది. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత వీహెచ్ విమర్శలు చేయగా.. హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ జాబితాలో చేరింది. ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలన ఇప్పుడు అర్జున్ రెడ్డి అభిమానులు తప్పుబడుతున్నారు

.

అసలు విషయానికి వస్తే.. బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ముద్దు ఒక ఎమోషన్ అయితే సెక్స్ ఏంటి? అంటూ ప్రశ్నించింది. ముద్దు ఒక ఎమోషన్ అయితే దాన్ని మించిన ఎమోషన్ సెక్స్ అని శెలవిచ్చింది అనసూయ. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా వుండలేరా... సమాజానికి ఇలాంటి మాటలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో వాడిన బూతు డైలాగును ఆడియో వేడుకకు వచ్చినవారితో పలికించడం దారుణమంది. తను చిత్రాన్ని చూడకపోయినా వారి మాటలతోనే జుగుప్స కలుగుతోందని చెప్పుకొచ్చింది.

ఆమె మాటలకు అర్జున్ రెడ్డి అభిమానులు తమదైన శైలిలో జవాబులిస్లున్నారు. తల్లి గురించి మాట్లాడే ముందు నువ్వు ఒక తల్లివ‌ని గుర్తుంచుకొని వేష‌దార‌ణని మార్చుకో.. ఎక్స్ పోజింగ్ ఆపేయ్.. వేదాలు చెప్ప‌డం ఎవ‌రైన చెబుతారు, ఆచ‌రించ‌డం అనేది ఇక్కడ పాయింట్ అంటూ నెటిజ‌న్స్ అన‌సూయ‌పై విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. నెటిజ‌న్స్ తో అన‌సూయ ఎదురు దాడి చేస్తున్నా, ఆమె మాట్లాడిన మాట‌లు ముమ్మాటికి త‌ప్పేన‌ని అంటున్నారు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ . మ‌రి ఈ వివాదం ఇంకెంత కాలం సాగుతుందో.