సారాంశం
అభిమానుల మధ్యకు వెళ్లినందకు ఓ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఫ్యాన్స్ కదా.. అని దగ్గరగా వెళ్తే.. ఓ వ్యక్తి చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. హీరోయిన్ ను సదరు అభిమాని అసభ్యంగా తాకడంతో.. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎక్కడ జరిగిందీ సంఘటన.
హీరోలుహీరోయిన్లు బయటకు రారు, జనాల్లో కలవరు అని అంటుంటారు. కాని వాళ్లు ప్రజల మధ్యకు వస్తే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని చాలా మందికి తెలియదు. అభిమానులే కదా అని వాళ్ళ మధ్యకు వెళ్తే.. కొంత మంది జనాలు చేసే వింత వికృత పనులకు సెలబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. కాని బాలయ్య లాంటి స్టార్ హీరోల జోలికి వెళ్లాలంటే మాత్రం వారు భయపడతారు. ఎందుకంటే ఇటువంటి పనులు చేసిన వారు ఎవరైనా సరే లాగి ఒక్కటివ్వడం బాలకృష్ణకు అలవాటే.
ఇక హీరోయిన్లు అయితే ఈ వియంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. పొరపాటున జనాల ముందుకు వస్తే.. వారు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. అసభ్యంగా తాకడం, మీదకి రావడం, భుజంపై చేతులు వేయడం, కొంత మంది అయితే వస్తువలు కూడా లాక్కుని వెళ్తుంటారు. అటువంటి చేదు అనుభవాలు ఫేస్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈక్రమంలో మరో హీరోయిన్ కు కూడా ఇలాంటి ఎక్స్ పీరియన్స్ జరిగింది. ఆమె ఎవరో కాదు మలయాళ ముద్దు గుమ్మ మంజు వారియర్. అభిమానుల మధ్య కు వెళ్లినందుకు మంజు వారియర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే?
ప్రముఖ మలయాళ హీరోయిన్ మంజు వారియర్ ను ఓ అభిమాని నడుం పట్టుకున్నాడు. మంజు వారియర్ తాజాగా, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో జనం ఆ షాపింగ్ మాల్ దగ్గర గుమ్మిగూడారు. హీరోయిన్ ను చూడాలని, ఫోటోలు దిగాలని ఎగబడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ముంజు వారియర్ కారు దగ్గరకు వచ్చింది. కారు ఎక్కి వెళ్లబోతుండగా జనం ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆమె కారులోంచి బయటకు వచ్చి.. అబిమానులకు అభివాదం చేసింది.
దాంతో చాలామంది మంజూకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. సెల్ఫీలి దిగారు. హీరోయిన్ ను పిలవడం స్టార్ట్ చేశారు కాని ఆమె పెద్దగా పట్టించుకోకుండా చేయి ఊపుతూ కారు ఎక్కబోయింది. ఆటైమ్ లోనే ఓఅభిమాని ఆమె నడుంపై చేయి వేసి లాగాడు. అయితే మంజూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఓ అభిమానికి మాత్రం సెల్ఫీ ఇచ్చి కారు ఎక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.