- Home
- Entertainment
- నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?
నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?
తెలగు సినీపరిశ్రమలో రికార్డ్ లు కొట్టిన తారలు ఎందరో నాలుగు తరాల వారితో నటించిన మోస్ట్ సీనియర్ స్టార్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు. వారిలో ఓ హీరోయిన్ అయితే 93 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ యాక్టీవగానే ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతోకలిసి నటించిన ఆ హీరోయిన్ ఎవరు? ఇండస్ట్రీలో ఆమె ప్రభావం ఏ భాషల్లో ఎక్కువగా ఉందో తెలుసా?

sowcar janaki
అలనాటి తెలుగు హీరోయిన్లకు తెలుగులో మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్టార్ డమ్ ఉండేది. మరీ ముఖ్యంగా మహానటి సావిత్రి, జమున, ఊర్వశి శారధ, అంజలి, కృష్ణ కుమారి, షావుకారు జానకి, గీతాంజలి లాంటి తారలు అన్ని భాషల్లో తమ ప్రభావాన్ని చూపించారు. ఈక్రమంలో ఇప్పటికీ యాక్టీవ్ గా ఉన్న అలనాటి హీరోయిన్ ఒకరు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు షావుకారు జానకి.
sowcar janaki
దాదాపు నాలుగు తరాల నటీనటులతో షావుకారు జానకి నటించారు. ఆమెతో కలిసి పనిచేసిన నలుగురు వ్యక్తులు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 93 ఏళ్ల ఈ సీనియర్ తార ఇప్పటికీ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను ఎంతో గౌవరిస్తారు. సాధరంగా ఆహ్వానించి మర్యాధలు చేస్తారు. దాదాపు 74 ఏళ్ళ మూవీ కెరీర్ ను కలిగి ఉన్న ఏకైక మోస్ట్ సీనియర్ నటి షావుకారు జానకి కావడం విశేషం.
sowcar janaki
1931 రాజమండ్రిలో పుట్టి పెరిగిన జానకి 14 ఏళ్ళకే రేడియో కార్యక్రమాలు చేశారు. 16 ఏళ్ళకే ఆమెకు పెళ్లి జరిగింది. సరిగ్గా దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే జానకి పెళ్ళి జరిగింది. తెలుగులో ఆమె స్టార్ గా వెలుగు వెలిగింది. కన్నడా, తమిళ సినిమాల్లో కూడా జానకి ప్రభావం ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా కన్నడ ప్రజలు ఆమెను తమ ఇంటి ఆడబిడ్డగా ఆధరించారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించిన షావుకారు జానకి. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీ రామారావుతో ముందుగా సినిమాలు చేసింది. ఆతరువాత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాచేసిన ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలితలతో తమిళంలో సినిమాలు చేశారు షావుకారు జానకి.
sowcar janaki
తెలుగు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోయినా.. తమిళ, కన్నడ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఆమెకు అవార్డ్ లు అందాయి. కన్నడ నాట నుంచి వాక్చిత్ర అమృతోత్సవ, తమిళనాడు నుంచి కలైమామణి, ఎం.జి.ఆర్, జయలలిత అవార్డులు లభించాయి. ఫిల్మ్ ఫేర్ తో పాటు, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకున్నారు జానకి. మకృష్ణకుమారి జానకి చెల్లెలు. ఆమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు.
sowcar janaki
ఎన్టీఆర్ రామారావు తో చేసిన షావుకారు సినిమా సూపర్ డూసర్ హిట్ అయ్యింది. దాంతో ఆహెకు షావుకారు జానకి అనే పేరు అలా స్థిరంగా ఉండిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు ఆగిపోయిన తరువాత అక్కగా, వదినగా, తల్లిగా, భామ్మగా వందల సినిమాల్లో మెరిశారు జానకి. ప్రస్తుతం ఆమె వయస్సు 93 ఏళ్లు. ఇప్పటికీ చాలా యాక్టీవ్ గా ఉన్నారు జానకి. సినిమా కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటున్నారు.