కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు నాడు అతడికి శుభాకాంక్షలు చెప్పాలని యష్ ఇంటికి వెళ్లిన రవి (28) అనే అభిమాని తనను ఇంటి లోపలకి పంపించడం లేదని పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు.

వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆయన మృతి చెందాడు. పావగడ ప్రాంతానికి చెందిన రవి కొన్నేళ్లుగా తల్లితండ్రులతో కలిసి లగ్గెరెలో నివసిస్తున్నాడు. నటుడు యష్ పట్ల విపరీతమైన అభిమానం గల రవి ప్రతి ఏడాది జనవరి 8న యష్ నివాసానిని వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. 

ఈ ఏడాది అంబరీష్ మృతి నేపధ్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి యష్ ఆసక్తి చూపలేదు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ముందుగానే వీడియో పెట్టాడు యష్. అభిమానులను తన పుట్టినరోజు వేడుకలు జరపద్దని కోరారు.

అయినప్పటికీ రవి మంగళవారం ఉదయం యష్ ఇంటికి వెళ్లారు. తన అభిమాన హీరో కలవడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన రవి ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. 

స్టార్ హీరో కోసం అభిమాని అఘాయిత్యం!