Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాప్ సినిమాలకు ప్రచారాల హోరు!

ఈ మధ్యకాలంలో ఫ్లాప్ సినిమాలకు కూడా విపరీతమైన ప్రచారాలు చేస్తూ ప్రేక్షకులపై 

fake success bashes for flop film

ఈ మధ్యకాలంలో ఫ్లాప్ సినిమాలకు కూడా విపరీతమైన ప్రచారాలు చేస్తూ ప్రేక్షకులపై ఆ సినిమాలను రుద్దే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో ప్రచారాల హోరు మరింత ఎక్కువైంది. సినిమా పీఆర్వోలు, పెర్సనల్ మేనేజర్లు వీటిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందని ఊరుకుంటారా..? అంటే లేదు.. తొలి షో నుండే సినిమా హిట్, బ్లాక్ బస్టర్ అని పోస్టర్లు వేసేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ సంగతి ఉండనే ఉంది. వారికి కావలసినంత డబ్బు ఇచ్చి సినిమాపై పాజిటివ్ టాక్ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.

దీనికి ఉదాహరణగా నిలిచింది తాజాగా విడుదలైన ఓ చిత్రం. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక సినిమా మొదటిషోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు కనీసపు వసూళ్లు కూడా రావేమోననే టెన్షన్ లో ఉన్నారు. అలాంటిది ఈ సినిమా సూపర్ హిట్ అని, అన్ని చోట్ల నుండి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని చిత్రబృందాన్ని పొగిడిస్తూ ట్విట్టర్ లో వీలైనన్ని పోస్ట్ లు పెట్టిస్తున్నారు.

వీకెండ్ తరువాత కనీసం ఈ సినిమాను పట్టించుకునేనాధుడే లేకపోయినా.. చిత్రబృందం మాత్రం సక్సెస్ మీట్లు నిర్వహిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ఈ ప్రచారాల ద్వారా సినిమాకు పబ్లిసిటీ రావట్లేదు సరికదా వీరు చేసే అతి చూస్తూ విసిగిపోతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎటువంటి ప్రచారాలు చేయకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంఘటనలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios