వాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టండి... బాబుకు సంఘీభావంగా బాలయ్య ఫ్యాన్స్ పిలిపు!
మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. తన భార్య భువనేశ్వరి వ్యక్తిత్వంపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆయన బాధపడ్డారు. ఈ విషయంలో ఆల్ ఇండియా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ బాబుకు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో వైసీపీ నేతల చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ (ntr) కుమార్తె రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) గారి కుటుంబ సభ్యులను వారి సతీమణి ఈరోజు అసెంబ్లీలో వైసిపి అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమని ఇది యావత్ మహిళా జాతికి జరిగిన అవమానంగా దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా ఎన్.బి.కె (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి బి జి తిలక్ అన్నారు.
ఇప్పటికే మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇటువంటి భాష వాడుతున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని వీర మన ప్రజా ప్రతినిధులు మరి ప్రజలు విస్తుపోతున్నారు అని ఈరోజు జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా నిలుస్తుందని ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారిని టిడిపి క్యాడర్ ను ఎన్నో అవమానాలు గురిచేస్తూ ముఖ్యంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఈరోజు అతి నీచంగా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను అందులో ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి గారి గురించి అవమానకరంగా మాట్లాడటం చాలా దారుణం దీన్న ముక్తకంఠంతో నందమూరి అభిమానులు ఖండిస్తున్నారు అని తెలిపారు.
అన్ని నియోజకవర్గాల లో జగన్ ,కొడాలి నాని ,అంబటి రాంబాబు ,చంద్రశేఖర్ రెడ్డి రోజా, కన్నబాబు ,వల్లభనేని వంశీ వారి దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో తగలబెట్టాలని కోరుతూ ఆలిండియా ఎన్.బి.కె ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు.
చంద్రబాబు కుటుంబానికి సినీనిర్మాత అశ్వినీదత్ సంఘీభావం
Also read నయనతార బర్త్ డేః సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. కలలు కన్నది, జయించింది.. `క్వీన్` అంటూ ప్రశంస.. వైరల్
అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ బాబుకు అండగా నిలిచారు. ఏ మాత్రం స్థాయి లేని వెధవలు అన్న మాటలకు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. పనికి మాలిన వ్యక్తుల స్థాయి ప్రమాణాలకు అతీతమైన ఎత్తులో చంద్రబాబు ఉన్నారు. తెలుగువారంతా ఆత్మీయంగా అభిమానించే ప్రేమమూర్తి చంద్రబాబు... అంటూ ఆయనను కొనియాడారు.