తనకు ఆ అందం వుంది కాబట్టే చూపిస్తున్నానంటున్న ఇషా గుప్తా ఇటీవల నెటిజన్లకు తన నగ్న ఫోటోలతో మతిపోగొట్టిన ఇషా భారతీయురాలేనా అని విమర్శలు చేస్తున్న వారిని కడిగిపారేస్తున్న ఇషా
. ఇటీవల న్యూజ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తన అందంతో కుర్రకారుకు గుబుల రేపిన బాలీవుడ్ నటి ఈషా గుప్తా. తన న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ పాపులర్ అయిన ఇషా గుప్తా ఎవరూ చేయని సాహసం చేసిందని చెప్పాలి. కాస్త మంచి ఇమేజ్ వున్న ఏ హీరోయిన్ కూడా చేయని స్థాయిలో సూపర్ హాట్ ఫొటో షూట్లతో మతి పోగొట్టేసింది ఈషా. ఆమె చూపించిన అందాలు.. ఇచ్చిన పోజులకు కుర్రాళ్ల మతులు పోయాయి. ఏదో ఒక ఫొటో షూట్ తో సరిపెట్టుకుండా ఒక సిరీస్ రిలీజ్ చేసి చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచింది ఈషా.
ఐతే ఈ ఫొటో షూట్లను ఎంజాయ్ చేసేవాళ్లు చేశారు కానీ.. ఇంకొందరు మాత్రం ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు వ్యక్తిగతంగా హేట్ మెయిల్స్.. మెసేజెస్ చాలా వచ్చినట్లు కూడా చెప్పింది ఈషా గుప్తా. వాటన్నింటికీ సమాధానంగా ఆమె ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చింది.
నాకు అందముంది.. చూపిస్తున్నా.. మీకేంటి.. అంటూ ఆమె సూటిగా ప్రశ్నించింది ఈ స్టేట్మెంట్లో.‘‘ప్రపంచంలో ఇన్ని సమస్యలుండగా నా ఫొటో షూట్ గురించి ఇంత చర్చ అవసరమా? మన చుట్టూ ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ముందు వాటి గురించి మాట్లాడండి. నన్ను తిడుతూ చాలామంది మెయిల్స్ పెట్టారు. వాళ్లను తిడుతూ సమాధానం ఇవ్వలేదు. మరిన్ని ఫొటోలు పోస్ట్ చేశాను. నేను అందంగా ఉంటాను. నా అందాలను బంధించిన ఫొటోలు నాకు నచ్చాయి. వాటిని పంచుకున్నాను. అలాంటపుడు మీకేంటి? ఓ భారతీయ అమ్మాయి అందాల ఆరబోస్తుంటే చూసి వాళ్ల మగతనం ఎక్కడ షేక్ అవుతుందో అని మగాళ్లు కంగారు పడిపోతున్నారు. ఆత్మవిశ్వాసం లేని ఆడవాళ్లే నన్ను విమర్శిస్తున్నారు. నా ఫొటోలపై వస్తున్న కామెంట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. ప్రపంచం తిరోగమనంలో వెళ్తోందా అనిపిస్తోంది. ‘అసలు ఓ భారతీయ అమ్మాయి చేసే పనేనా?, ‘ఇషా భారతీయురాలే కాదు’.. ఈ తరహా విమర్శలే నన్ను ఎక్కువ బాధపెడుతున్నాయి. నన్ను విమర్శించే అందరి కంటే నేనే అసలు సిసలు భారతీయురాల్ని. నా తండ్రి దేశానికి ఎంతో సేవ చేశారు. మరి మీ తండ్రి చేశారా?’’ అని ప్రశ్నించింది ఈషా.
