ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ కు మాస్ లో ఇమేజ్ పెరిగింది. ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో రెడ్ మూవీలో నటిస్తున్నాడు. నటన, డాన్సులు, డైలాగ్ డెలివరీ అన్ని విధాలుగా రామ్ ఆకట్టుకుంటున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో పూరి జగన్నాధ్ రామ్ ని కంప్లీట్ మాస్ లుక్ లో చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇస్మార్ట్ సక్సెస్ తర్వాత రామ్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కానీ రామ్ మాత్రం కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 

ఇక యువ దర్శకుడు అనిల్ రావిపూడి పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. అనిల్ తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలన్నీ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

యాక్షన్, లవ్, కామెడీ ఇలా అన్ని అంశాలు అనిల్ రావిపూడి చిత్రాల్లో సమపాళ్లలో ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తదుపరి చిత్రం ఎవరితో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది. 

పూరి జగన్నాధ్ స్టామినా ఇదే.. బాలయ్య కోసం ఏంచేశాడంటే!

అనిల్ రావిపూడి, రామ్ కాంబినేషన్ లో మొదటగా రాజా ది గ్రేట్ చిత్రం రావాల్సింది. కానీ రామ్ ఆ చిత్రంలో నటించలేదు. రామ్ కోసం అనిల్ రావిపూడి మరో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ రెడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక అనిల్ రావిపూడి, రామ్ కాంబినేషన్ గురించి పూర్తి క్లారిటీ రానుంది.