కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా?

First Published 9, Apr 2018, 5:07 PM IST
elizabeth hurley trolled in social media
Highlights
కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా?

 ఎలిజబెత్ హర్లీకి నెటిజన్లు చుక్కలు చూపించారు. తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఫోజిచ్చిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వక్షస్థలం కనిపించే విధంగా కొడుకుతో దిగిన ఫొటోపై ఫ్యాన్స్ దారుణమైన కామెంట్లు చేస్తూ గొడవ చేశారు. తన కుమారుడి 16వ పుట్టిన రోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డామియన్ హర్లీ. గత 16 ఏళ్లుగా నా జీవితానికి కాంతికిరణంగా మారావు అని హార్లీ తన ఇన్స్‌టాగ్రామ్ ఫోటో పెట్టి కామెంట్ చేసింది.

కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా? నీవు ఓ బిడ్డకు తల్లివనే విషయాన్ని మరచిపోతున్నావు అని తన కొడుకుతో కలిసి ఉన్న హర్లీ ఫోటోపై నెటిజన్లు కామెంట్లు చేశారు. నీ సంపదను చూపించుకోవడం బాగానే ఉంది. కానీ చూడటానికి అసభ్యంగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లు చేస్తున్న వారిపై హార్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎలా ఉంటే మీకెందుకు? తనకు నచ్చిన విధంగా ఉండనివ్వండి. మీ గురించి మీరు ఆలోచించుకొండి అని కొందరు హార్లీకి మద్దతుగా నిలిచారు.

loader