చాన్స్ కోసం వాళ్లంతటవాళ్లే పడుకుంటామని ఆఫర్ ఇస్తారు- ఏక్తా కపూర్

First Published 17, Feb 2018, 2:58 PM IST
ekta kapoor sensational comments on casting couch
Highlights
  • కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా దుమారం
  • తాజాగా కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన ఏక్తా కపూర్
  • చాన్స్ కోసం హిరోయిన్లు వాళ్లంతట వాళ్లే దాన్ని ఆఫర్ చేస్తారన్న ఏక్తా

కొద్ది రోజులుగా హాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నిర్మాత హార్వీ.. చాలామంది హీరోయిన్లను మహిళలను సినిమా అవకాశాల కోసం లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో - ఆఫీసుల్లో - పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలందరూ మీటూ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం నడిపారు.

 

బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా పలువురు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏక్తా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం కొందరు తమంతటతామే లైంగిక కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ నిర్వహించిన ఓ షోలో ఏక్తా కపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఇప్పటివరకు కొందరు హీరోయిన్లు తప్పని సరి పరిస్థితులలో... బలవంతంగా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని చెప్పిన ఘటనలు విన్నాం. క్యాస్టింగ్ కౌచ్ లో దాదాపుగా దర్శకనిర్మాతలనే విలన్ లుగా చిత్రీకరించేవారు. అయితే చాన్స్ ల కోసం వారి లైంగిక వాంఛను తీర్చేందకు సిద్ధపడే నటీనటులు ఇండస్ట్రీలో బోలెడుమంది ఉన్నారని ఏక్తా కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బలమైన వారిని, శాసించే స్థితిలో ఉన్నవారినే దోషులుగా చిత్రీకరించడం తగదన్నారు.

 

డబ్బు, హోదా , అధికారం లేవు కాబట్టి వారినే బాధితులుగా పరిగణించకూడదన్నారు. బాలీవుడ్ లో చాలా మంది హార్వీలున్నారని, తమ ఇష్టానుసారంగానే అవకాశాల కోసం సెక్స్ చేసిన యాక్టర్ల సంఖ్య తక్కువేమీ కాదన్నారు. చాన్స్ కోసం వారు చేసింది తప్పుకాకపోవచ్చని, కానీ వివాదం వచ్చినప్పుడు అవతలివారినే దోషులనడాన్ని మాత్రం తాను సమర్థించనన్నారు ఏక్తా.

 

``చాన్స్ కోసం రాత్రి 2 గంటల సమయంలో ఓ నిర్మాత దగ్గరికి ఓ నటి వెళ్లిందనుకుందాం. ఆ తర్వాత తన సినిమాలో ఆమెకు సరిపోయే పాత్ర లేకపోవడంతో ఆమెకు చాన్స్ ఇవ్వలేదు. ఇందులో ఎవరిది తప్పు? శక్తిమంతులే అడ్వాంటేజ్ తీసుకుంటారనడం సరికాదు`` అని ఏక్తా ఘాటుగా స్పందించారు.

loader