Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: ఈ నగరానికి ఏమైంది?


'పెళ్లిచూపులు' వంటి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన స్టైల్ లో

ee nagaraniki emaindi telugu movie review

నటీనటులు: విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్ తదితరులు 
సంగీతం: వివేక్ సాగర్ 
ఎడిటింగ్: రవితేజ గిరిజాల 
నిర్మాత: దగ్గుబాటి సురేష్ బాబు
దర్శకత్వం: తరుణ్ భాస్కర్ 

'పెళ్లిచూపులు' వంటి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన స్టైల్ లో 'ఈ నగరానికి ఏమైంది?' అనే సరికొత్త సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా మరి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
వివేక్(విశ్వక్ సేన్) , కార్తిక్(సాయి సుశాంత్), కౌశిక్(అభినవ్), ఉపేంద్ర(వెంకట్) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మొదట్లో సరదాగా షార్ట్ ఫిలిం చేయాలనుకొని తరువాత సీరియస్ గా ప్రయత్నిస్తుంటారు. వివేక్ డైరెక్టర్ గా, కార్తిక్ కెమెరామెన్ గా, కౌశిక్ యాక్టర్ గా. ఉపేంద్ర ఎడిటర్ గా షార్ట్ ఫిలిం చేయడానికి రెడీ అవుతారు. కానీ ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో నలుగురు నాలుగు రకాల ప్రొఫెషన్స్ తో బిజీ అయిపోతారు. కానీ షార్ట్ ఫిలిమ్స్ చేయాలనే కల మాత్రం అలానే ఉండిపోతుంది. ఓరోజు ఈ నలుగురు స్నేహితులు బార్ కూర్చొని పార్టీ చేసుకుంటుంటారు. అందరూ మత్తులో ఉండడంతో గోవా వెళ్లాలని అనుకుంటారు. కార్ లో గోవాకు బయలుదేరతారు. అక్కడ కొన్ని కారణాల వలన షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటారు. మరి అనుకున్నట్లుగా షార్ట్ ఫిలిం తీయగలిగారా..? చివరికి వీరిజీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అనేదే మిగిలిన కథ. 

విశ్లేషణ: 
మనకి నచ్చిన పని చేస్తూ నాలుగు మెతుకులు తింటూ నచ్చిన వారితో జీవించాలనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. నలుగురు స్నేహితులు వారి షార్ట్ ఫిలిం కష్టాలు ఇదే సినిమా. నిజానికి సినిమాలో కథ ఇది అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. నాలుగు క్యారెక్టర్లు తీసుకొని వాటి చుట్టూ కథను నడిపించిన విధానం మంచి ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు హాలీవుడ్ లో వచ్చిన 'హ్యాంగ్ ఓవర్' సినిమా గుర్తుకురావడం ఖాయం. ముఖ్యంగా వివేక్ అనే క్యారెక్టర్ ఆ సినిమా నుండి స్ఫూర్తి పొందినట్లుగా అనిపిస్తుంది. కానీ దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రత్యేకత ఏంటంటే.. మామూలు కథని కూడా తెలివిగా చెప్పుకొస్తూనే.. కడుపుబ్బ నవ్వించే హాస్యాన్ని రంగరించి అలరించాడు. వినోదం కోసం సన్నివేశాలను సృష్టించకుండా, తన కథలో హాస్యాన్ని భాగం చేసిన తీరు అభినందనీయం.

ee nagaraniki emaindi telugu movie review

సినిమాలో కనిపించిన నలుగురు కుర్రాళ్లకు సమాన ప్రాముఖ్యతనిచ్చారు. ముఖ్యంగా అభినవ్ వేసే పంచ్ లు థియేటర్లో బాగా పేలాయి. సినిమాలో నాలుగు మెయిన్ క్యారెక్టర్లు కూడా తెలంగాణా మాండలికంలో మాట్లాడుతూ వినోదం పండించడం ఈ చిత్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. ప్రథమార్ధం చాలా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా సాగిపోతుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో సెకండ్‌ హాఫ్‌ ఇలా ఉంటుందనే ఓ ఐడియా వస్తుంది. కానీ కొత్త దర్శకుడి కొత్త ఆలోచనలతో అదెంత కొత్తగా చెప్తాడో అని ఎదురు చూస్తే, సెకండ్‌ హాఫ్‌ని ఊహించినట్టుగానే నడిపించి ఒకింత డిజప్పాయింట్‌ చేస్తాడు. కాకపోతే ఆ బలహీనతలు హైలైట్‌ అవకుండా వీలు కుదిరినప్పుడల్లా చక్కని హాస్యంతో ఎంటర్‌టైన్‌ 
చేశారు. ఎమోషన్ ను యాడ్ చేయాలని చూసినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

ee nagaraniki emaindi telugu movie review

ఏదేమైనా.. తరుణ్ చక్కటి అవుట్ పుట్ తీసుకురావడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకట్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్వక్ సేన్ సినిమా మొత్తం కళ్లజోడుతో కనిపించడం, ఆ పాత్రను సరికొత్తగా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సిమ్రాన్, అనీషా ఆంబ్రోస్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ ఉన్నంతలో బాగానే అలరించారు. ద్దల పాత్రలకి ఎంచుకున్న వారంతా కూడా మంచి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ క్యామియో మెప్పిస్తుంది. సాంకేతిక వర్గం కూడా సూపర్బ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చి దర్శకుడు తరుణ్ భాస్కర్ పని మరింత సులువు చేసింది. సంగీతం వినడానికి వినసొంపుగా ఉంటే.. చాయాగ్రహణం కంటికింపుగా అనిపిస్తుంది. మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ రెండో సినిమాకు తనపై పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యాడనే చెప్పాలి. 
రేటింగ్: ౩/5  

Follow Us:
Download App:
  • android
  • ios