కన్నడ హీరో దునియా విజయ్ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. గత కొద్దిరోజులుగా అతడి ఇద్దరు భార్యలు గొడవ పడుతుండడంతో విజయ్ కుటుంబ రోడ్డున పడింది. దునియా విజయ్ రెండో భార్య కీర్తిగౌడపై అతడి మొదటి భార్య నాగరత్న దాడి చేయించింది.

దీనికి సంబంధించిన వీడియోని విజయ్, కీర్తి గౌడలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరత్న ఆమె కూతురు మోనికాపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లగా.. మోనికా తన తల్లి ఇంట్లో లేదని చెప్పి వారిని పంపించేసింది.

ఆదివారం నాడు నాగరత్న తరఫున లాయర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె ఆయుధాలతో దాడి చేయలేదని, చేతితో కొట్టడం వలనే గాయమైందని ఆమెకి స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే పోలీసులు నాగరత్న కూతురు మోనికాను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దునియా విజయ్ తన రెండో భార్య కీర్తితో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.

కూతురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడు కన్నీరు పెట్టుకున్నారు. తల్లి చేసిన తప్పుకి కూతురిని శిక్షించడం కరెక్ట్ కాదని అన్నారు. పిల్లలని అడ్డుపెట్టుకొని నాగరత్న నాటకాలు ఆడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దునియా విజయ్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి విలేకరులతో మాట్లాడారు.

18 ఏళ్లు నిండుతున్న కూతురు ఇలాంటి వాతావరణంలో ఉండటంపై వారిపై చెడు ప్రభావానికి దారితీస్తుందని మీడియా ముందే ఏడ్చేశారు. ఇక పోలీసులు నాగరత్నని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

నటుడు విజయ్ అరెస్ట్!

హీరో విజయ్ ఇద్దరు భార్యల సిగపట్టు!

హీరోపై కూతురి కేసు!