Asianet News TeluguAsianet News Telugu

నటుడు విజయ్ అరెస్ట్!

కన్నడ నటుడు దునియా విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఐ‌పి‌సి సెక్షన్ 365, 342, 325, 506 కింద కేసులు నమోదు చేశారు. మారుతి గౌడ అనే వ్యక్తిపై తన మనుషులతో దాడి చేయించిన కేసులో విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Duniya Vijay arrested in kidnap and assault case
Author
Hyderabad, First Published Sep 23, 2018, 7:33 PM IST

కన్నడ నటుడు దునియా విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఐ‌పి‌సి సెక్షన్ 365, 342, 325, 506 కింద కేసులు నమోదు చేశారు. మారుతి గౌడ అనే వ్యక్తిపై తన మనుషులతో  దాడి చేయించిన కేసులో విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. మారుతి గౌడ అనే వ్యక్తి అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలు చూడడానికి వెళ్లగా విజయ్ అతని స్నేహితులు పది మంది కలిసి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ.. ''మా అంకుల్ గురించి విజయ్ తప్పుగా మాట్లాడాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని నేను ప్రశ్నించగా.. అతను ఓ పది మందితో కలిసి నాపై దాడి చేసి నన్ను అక్కడ నుండి తీసుకెళ్లారు. 

అలా కొంతదూరం ప్రయాణించిన తరువాత వాళ్లు ఓ చోట కారు ఆపి నాపై దాడి చేశారు''అంటూ వెల్లడించారు. అంతేకాదు ఆ దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విజయ్ ని అదుపులో తీసుకున్నారు. విజయ్ ని త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios