జురాసిక్ పార్క్ పట్టించుకునేవారే లేరా..?

First Published 6, Jun 2018, 3:47 PM IST
Dull bookings for jurrasic world all over india
Highlights

జురాసిక్ పార్క్ పట్టించుకునేవారే లేరా..?

స్ట్రయిట్ తెలుగు సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇటీవల కాలంలో హాలీవుడ్ మూవీస్ టాలీవుడ్ బాక్సాఫీసును దండెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలను కూడా మన వాళ్లు బాగానే ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అవెంజర్స్ ఇన్ఫీనిటీ వార్‌కు వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం నిర్ఘాంతపరిచాయి. తాజాగా తెలుగువారికి బాగా సుపరిచితమైన జురాసిక్ సీరిస్‌లో భాగంగా జురాసిక్ వరల్డ్ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జురాసిక్ సీరిస్‌లో వచ్చిన గత చిత్రాల రిజల్ట్ దృష్ట్యా ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. అయితే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్‌లలో ఈ సినిమాకు బుకింగ్స్ అంతగా జరగడం లేదని టాక్ వినిపిస్తోంది. గురువారం రిలీజ్ అవుతుండటంతో పాటు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో బుకింగ్స్ మందకొడిగా సాగుతున్నాయని క్రిటిక్స్ అంటున్నారు.

loader