పోలీసులను ఒక ఆట ఆడుకున్న ఈ మందు భామ (వీడియో)

First Published 9, Apr 2018, 1:08 PM IST
drunken Women argues with cops in Hyderabad
Highlights
పోలీసులను ఒక ఆట ఆడుకున్న ఈ మందు భామ

వారాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న యువతులు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. ఈ శనివారం రాత్రి వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి తన స్నేహితుడితో కారులో వచ్చింది. ఆ వాహనాన్ని పోలీసులు ఆపి బ్రెత్ ఎలైజర్ టెస్టు కు సిద్ధమయ్యారు. అంతే ! కారు వెనుక సీటులో కూచున్న ఈమె ఒక్కసారిగా బయటకు వచ్చి వారిపై దాడికి దిగింది. కారులోని వ్యక్తితో బాటు ఈ “ఫైర్ బ్రాండ్ ” కూడా చుక్కేసుకుందని పోలీసులకు అర్థమైపోయింది. తనను ప్రశ్నిస్తున్న ఖాకీలను దుర్భాషలాడడమేగాక..ఈవిడగారి దూకుడును చిత్రీకరిస్తున్న మీడియాపైనా చిందులేస్తూ..రోడ్డుపైనున్న రాళ్ళువిసిరి నానా హంగామా చేసింది. ఇదంతా చూస్తూ…  ప్రేక్షక పాత్ర వహించడం పోలీసుల వంతయింది. చివరకు ఎలాగైతేనేం ! ఖాకీలు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని నడుపుతున్న వ్యక్తిపై కేసు పెట్టారు.`

                   

loader