ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న బాహుబలి 2 బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రం టీజర్ బాహుబలి2 రిలీజయ్యే ఏప్రిల్28కి ఒకరోజు ముందు 27నే..
బాహుబలి చిత్రంతో దేశ వ్యాప్తంగా.. అభిమానులను సంపాదుంచుకున్న హీరో ప్రభాస్. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం విడుదలకు మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. తొలి భాగంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త చరిత్ర సృష్టించిన బాహుబలి టీం ఇప్పుడు రెండో భాగంతో తమ రికార్డ్ లను తామే బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. అయితే బాహుబలి 2 రిలీజ్ కు ఒక్క రోజు ముందే తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు హీరో ప్రభాస్.
బాహుబలి తరువాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. అంతేకాదు ముందుగా అనుకున్నట్టుగా బాహుబలి సినిమాతో పాటు కాకుండా ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 27నే ప్రభాస్, సుజిత్ ల సినిమా టీజర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి కావటంతో ప్రస్తుతం గ్రాఫిక్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించే పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సాహో టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.
