- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Illu Illalu Pillalu Today Episode Feb 26: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, భాగ్యం కలిసి భారీ ప్లాన్ వేసి నర్మదను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రేమ నగలు వేసుకున్న నర్మదను చూసి వల్లి ఇరికిస్తుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

పార్టీలో నర్మద పరువు తీసేందుకు ప్లాన్
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ధీరజ్, ప్రేమ కార్ షో రూమ్ లో ఉంటారు. ఏ కారు కొనాలా అని చూస్తూ ఉంటారు. ప్రేమ వద్దని చెబుతున్నా కారు కొనేందుకు సిద్ధమవుతాడు. చివరికి ఒక కారు నచ్చిందని అదే కొనేందుకు సిద్ధమవుతాడు. ఈ లోపు ఇంట్లో ప్రేమ ధీరజ్ కనిపించకపోయేసరికి నర్మద ప్రేమకు ఫోన్ చేస్తుంది. నర్మదతో మాట్లాడుతూ ప్రేమ ధీరజ్ కారుకుంటున్న విషయాన్ని చెబుతుంది. నర్మద తన మనసులో ఏమీ బాలేదని ఇంటికి వస్తే నీకు కొన్ని విషయాలు చెప్పాలని చెబుతుంది. తర్వాత సాగర్ కి జాబ్ వచ్చినందుకు మా నాన్న పార్టీ అరేంజ్ చేశారు, కానీ చూస్తుంటే అత్తయ్య మావయ్య వచ్చేలా లేరు అని నర్మద చెబుతుంది. అప్పుడు ప్రేమ ‘నేను ధీరజ్ మాత్రం కచ్చితంగా వస్తాము’ అని చెబుతుంది. ఈలోపు నర్మద ప్రేమతో ‘ఏమీ అనుకోకపోతే నీ నగలిస్తావా? ఫంక్షన్ కి పెట్టుకుని తిరిగి వచ్చాక ఇచ్చేస్తాను’ అని అడుగుతుంది. దానికి ప్రేమ ‘అలా అడుగుతావేంటి, స్వతంత్రంగా తీసుకునే హక్కు నీకుంది తీసుకో అక్క’ అని చెబుతుంది.
ఇక్కడ నుంచి సీన్ వల్లి, భాగ్యం దగ్గరికి మారుతుంది. వల్లి అందంగా పార్టీకి రెడీ అవుతుంది. భాగ్యం మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు నర్మద మన చేతికి చిక్కింది. ఆ ఫంక్షన్ లో నువ్వు నర్మదను చెడుగుడు ఆడుకొని చుక్కలు చూపించు. నేను ఇక్కడే ఇంట్లో శకుని లాగా పాచికలు వేసి మిగతా కథ నడిపించేస్తాను. నర్మద కథ కంచికి చేర్చేస్తాను’ అని చెబుతుంది భాగ్యం. అది విని బల్లి ఆనంద పడిపోతూ ఉంటుంది. ఈలోపు వేదవతి కూడా పార్టీకి చీర కట్టుకొని తయారై రావడం వీరికి కనిపిస్తుంది. వేదవతి వచ్చి సాగర్, నర్మద ఇంకా రాలేదా అని అడుగుతుంది. దానికి వల్లి ‘సాగర్ మరిది గారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని అందరికీ పరిచయం చేయాలి కదా. అప్పుడు పక్కనే నర్మద కూడా ఉంటుంది కదండీ. చక్కగా రెడీ అవుతూ ఉంటారు’ అంటుంది. అక్కడికి నర్మద, సాగర్ వస్తారు.
ప్రేమ నగలతో నర్మద
సాగర్ ప్రేమతో తన తల్లిని హత్తుకుంటాడు. వేదవతి మాట్లాడుతూ ‘కన్నవాళ్ళుగా మాకు మీరు చేసే పనులు నచ్చకపోయినా.. ఆ కోపం ఆ పనుల మీద తప్ప మీ మీద కాదు. పిల్లల మీద ఉన్న ప్రేమ కన్న వాళ్ళకి అంత సులువుగా ఎలా పోతాయి. నీ ఉద్యోగం గురించి ముందే మీ నాన్నగారికి నువ్వు చెప్పి ఉంటే ఈ పార్టీని మీ నాన్నే ఆనందంగా ఏర్పాటు చేసేవారు. సరే వెళ్దాం పదండి’ అని అందరూ బయలుదేరుతారు.
అదే సమయానికి వల్లి నర్మద దగ్గరికి వచ్చి ‘ఈ నగలు ప్రేమ నగల్లా ఉన్నాయి కదా, నీకు నీ పుట్టినరోజు ఇచ్చినా బోలెడన్ని నగలు ఉన్నాయి కదా. మరి నీవి కాకుండా ప్రేమ నగలు ఎందుకు వేసుకున్నావు’ అని అంటుంది. నర్మద సమాధానం చెప్పకుండా ఉండిపోతుంది. వేదవతి కూడా అదే ప్రశ్న అడగడంతో నర్మద ‘నా నగలు మా అమ్మ వాళ్ళింట్లో బీరువాలో ఉన్నాయి. మా అమ్మ బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయిందంట. అందుకే ప్రేమ నగలు వేసుకున్నాను’ అని అబద్ధం చెబుతుంది.
భాగ్యం వల్లితో సీక్రెట్ గా ‘నర్మద నగల గురించి చెప్పిన ఈ అబద్దమే మనకు పెద్ద బ్రహ్మాస్త్రం. నర్మద నగలు తాకట్టు పెట్టి వనజ గారికి ఆ డబ్బులు ఇచ్చిందనే విషయం అడ్డుపెట్టుకొని నర్మదను ఒక ఆట ఆడుకో’ అని వల్లికి చెబుతుంది. ఆ సమయంలో సాగర్ ఉద్యోగం కొన్న విషయం కూడా బయట పడిపోతుంది అని అంటుంది.
చిచ్చు పెట్టేసిన భాగ్యం
వేదవతి భాగ్యాన్ని కూడా రమ్మని పిలుస్తుంది. కానీ భాగ్యం ఓవరాక్షన్ చేస్తూ ‘అన్నయ్య గారికి ఇష్టం లేని ఇంటికి మేము ఎలా వస్తాము, మీరు కొడుకు కోడలు కోసం భర్త బాధపడినా కూడా వెళతారు. మా గురించి ఏం పట్టించుకోకండి. ఏం పర్లేదు మీరు వెళ్లి రండి’ అని అంటుంది. అందరూ బయలుదేరుతారు. తర్వాత భాగ్యం జాబ్ ఇచ్చిన ఏజెంట్ కి ఫోన్ చేస్తుంది. మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. డబ్బులు వచ్చి తీసుకెళ్ళు అని చెబుతుంది. పార్టీ జరిగే లొకేషన్ ను ఏజెంట్ కు పంపిస్తుంది భాగ్యం.
ఆనందంలో ప్రేమ
ఇక్కడ నుంచి సీన్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. కారు 15 లక్షలు రూపాయలు అవుతుందని మేనేజర్ చెబుతాడు. దాంతో ప్రేమ షాక్ అవుతుంది. మొదట రెండు లక్షల పే చేయాలి, మిగతాది ఈఎమ్ఐగా కట్టుకోవచ్చు అంటాడు మేనేజర్. దానికి ఓకే చెబుతాడు ధీరజ్. ఇరవై వేల రూపాయల ఇచ్చి ముందస్తు కార్ బుకింగ్ చేస్తాడు. కారును ప్రేమ పేరు మీదే బుక్ చేస్తాడు. తన తండ్రి ఏం చేసినా తన తల్లి పేరు మీద చేసేవాడని, అందుకే తాను కూడా తన భార్య పేరు మీద బుక్ చేస్తానని చెబుతాడు. దాంతో ప్రేమ ఆనందంతో పొంగిపోతుంది. ప్రేమ మాత్రం ధీరజ్ పేరు మీదే చేయించుకోమని అంటుంది, లేదా మీ అమ్మ పేరు మీద నాన్న పేరు మీద తీసుకోమని చెబుతుంది. అయినా కూడా ధీరజ్ వినడు.
మా నాన్నకు మా అమ్మ ఎంతో.. నువ్వు నాకు అంతే అని చెబుతాడు. దాంతో ఆనందంతో ధీరజ్ ను కౌగిలించుకుంటుంది ప్రేమ. తర్వాత ఇద్దరు వెళ్లి కారు కొనే ప్రాసెస్ ను పూర్తి చేస్తారు. తర్వాత మేనేజర్ డెమో కారు ఒకటి ఉంది.. మీరు కావాలంటే ఒకసారి డ్రైవ్ చేసి చూడవచ్చు అని చెబుతాడు. ప్రేమ, ధీరజ్... ఇద్దరు అందులో కూర్చొని కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. వీరిద్దరి ప్రేమ సన్నివేశాలతోనే ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రామరాజు ఒక్కొక్కరికి గూబ పగులగొడతాడు. ముందుగా ఉద్యోగం ఇచ్చిన ఏజెంట్, తరువాత సాగర్ ను కొడతాడు.

