భర్తను హత్య చేసి పెరట్లోనే పూడ్చివేత, 20 ఏళ్ళ తర్వాత షాకైన రెండో భర్త

First Published 6, Jun 2018, 6:40 PM IST
Don’t worry, it’s my first husband' - Wife stuns bloke after skull found in garden
Highlights

భర్తను చంపి రెండో పెళ్ళి

మాస్కో: వేధింపులకు గురిచేస్తున్న భర్తను గొడ్డలితో ఓ భార్య హత్య చేసింది. మృతదేహాన్ని పెరట్లోనే పూడ్చిపెట్టింది. 20 ఏళ్ళ తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది. పెరట్లో పుర్రెను చూసిన రెండో భర్తకు  అసలు విషయం చెప్పింది భార్య. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమె తన భర్తకు సూచించింది. కానీ, భార్యపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన రష్యాలో చోటు చేసుకొంది.

రష్యాలోని లుజీనో గ్రామంలో ఊరి చివరన ఓ వృద్ద జంట నివాసం ఉంటుంది. ఆ మహిళ తన మొదటి భర్త చనిపోతే రెండో భర్తను వివాహం చేసుకొంది. ప్రస్తుతం వారిద్దరూ కూడ వృద్దాప్యంలో ఉన్నారు. అయితే ఇంటి ఆవరణలో బంగాళాదుంపల కోసం భర్త తవ్వాడు. అయితే ఇంటి ఆవరణలో అతడికి పుర్రె కన్పించింది. ఇంకా తవ్వితే మనిషి ఆస్తిపంజరం కన్పించింది. వెంటనే భార్యను పిలిచి చెప్పాడు. అయితే ఆమె మాత్రం  ఎలాంటి కంగారు పడలేదు.

 ఆ ఆస్థిపంజరం తన మొదటి భర్తకు సంబంధించిందని ఆమె రెండో భర్తకు స్పష్టం చేసింది. ప్రతి రోజూ తనను వేధింపులకు గురి చేస్తున్న కారణంగా గొడ్డలితో నరికి చంపేసి ఇంటి
ఆవరణలోనే పూడ్చిపెట్టినట్టు ఆమె చెప్పారు.

ఆస్థిపంజరంపై మట్టిని పూడ్చిపెట్టాలని ఆమె సూచించింది. కానీ,  రెండో భర్త మాత్రం ఈ మాటలకు షాక్ కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆమెను   అరెస్ట్ చేసి విచారించారు. తన మొదటి భర్తను హత్యచేసింది తానేనని ఆమె ఒప్పుకొన్నారు.

loader