ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు: ప్రభాస్

First Published 18, Jun 2018, 6:32 PM IST
don't ask me about marriage says prabhas
Highlights

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నాలుగు పదుల వయసుకి దగ్గర పడుతున్నా.. ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. 

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నాలుగు పదుల వయసుకి దగ్గర పడుతున్నా.. ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆయన పెళ్లి కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని అయన పెదనాన్న కృష్ణంరాజు అన్నారు.

భీమవరం పెళ్లి ఓ అమ్మాయిని కూడా చూసినట్లు సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని ప్రభాస్ వద్ద ప్రస్తావించగా.. కూల్ గానే ఘాటు సమాధానమిచ్చాడు. ''పెళ్లి అనేది నా పెర్సనల్ విషయం. దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చెప్పాలని కూడా అనుకోవడం లేదు.. నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు మీడియాకు చెబుతాను'' అని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ 'సాహో' సినిమాను రూపొందిస్తున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సో అప్పటివరకు ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఆలోచన లేదనే అనుకోవాలి!

loader