Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో ఒక పేషెంట్ కి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో వెంటనే రాజ్యలక్ష్మి ఇంటర్వ్యూకి వచ్చిన దివ్యతో ఆపరేషన్ చేయించమని చెబుతుంది. అప్పుడు మనోహర్ మేడం రిస్క్ అవుతుంది అనడంతో తనపై తనకు ఏమాత్రం నమ్మకం ఉందో ఎంత టాలెంట్ ఉందో తనకి కూడా తెలుస్తుంది. నేను చెప్పినట్టు చేయండి తొందరగా ఆపరేషన్ కి అని రెడీ చేయండి అని అంటుంది. మరొకవైపు తులసి దేవుడి దగ్గరికి వెళ్లి టెన్షన్ పడుతూ ఎలా అయిన దివ్య సెలెక్ట్ అవ్వాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. మరొకవైపు రాజ్యలక్ష్మి దివ్య ఈ ఆపరేషన్ చేయలేను అంటే ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోమని చెప్పు అనడంతో లేదు మేడం నేను చేస్తాను అనగా వెరీగుడ్ దివ్య పెళ్లి సర్జరీ మొదలుపెట్టు ఇంతలో సీనియర్ డాక్టర్ వచ్చి జాయిన్ అవుతారు అని అంటుంది రాజ్యలక్ష్మి.
అప్పుడు మనోహర్ మేడం ఒకటికి రెండుసార్లు ఆలోచించండి దివ్యతో ఆపరేషన్ చేయిస్తే ఏమైనా అవుతే ప్రాబ్లం అవుతుంది అనడంతో ఏం కాదులే మనోహర్ సీనియర్ డాక్టర్స్ చేసినప్పుడు ఎన్ని ఫెయిల్ అవ్వలేదు అది పేషెంట్ తలరాతపై ఆధారపడి ఉంటుంది అని కేర్ లెస్ గా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు దివ్య తులసి దగ్గరికి వెళ్లి ఏమైందమ్మా అనడంతో నువ్వు అనుకున్నట్టుగా గొడవపెట్టారు అనగా అవునమ్మా గొడవపెట్టారు సర్జరీ చేయమని గొడవ పెట్టారు అందుకే ఒప్పేసుకున్నాను అనగా ఇంటర్వ్యూ రోజే సర్జరీ ఏంటి దివ్య అనడంతో కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి సర్జరీ ఒప్పుకున్నాను అమ్మ అని అంటుంది.
యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే నేను సర్జరీలో పర్ఫెక్ట్ అయ్యాను అనడంతో షోర్ కదా ఒకసారి ఆలోచించు దివ్య అని అంటుంది తులసి. పొరపాటు ఏదైనా జరిగితే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది తులసి. అప్పుడు దివ్య తులసి పాదాలకు నమస్కరించుకొని నన్ను దీవించు అమ్మ అని అంటుంది. అప్పుడు దివ్య ఆపరేషన్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేయమంటే ముందు డబ్బు కట్టమని గొడవ చేస్తూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి ముందు ఆపరేషన్ చేయండి ఈ లోపు డబ్బు కడతారు కదా అనగా మేము ఇక్కడ రాయము కేవలం జబ్బు నయం చేస్తాము అని అంటాడు.
అయ్యా నా మాట వినండి అయ్యా అని ఆ ముసలి అతను డాక్టర్ కాళ్లు పట్టుకుంటారు గా లేవండి పెద్దాయన రాక్షసుల కాళ్ళ మీద పడితే మనసు కలుగుతుందేమో ఇలాంటి వాళ్ళ కాళ్ళ మీద పడితే ఏమీ రాదు అని అంటుంది తులసి. డాక్టర్లు దేవుడితో సమానం కనిపించని దేవుడు ప్రాణం పోస్తే కనిపించే ఈ డాక్టర్ దీవులు పునః జన్మ నీ ఇస్తారు అంటుంది తులసి. అప్పుడు తులసి మాట్లాడే మాటలు రాజ్యలక్ష్మి, ఆమె కొడుకు ఇద్దరు వింటూ ఉంటారు. మీరు అన్నట్టు ఈలోపు వాళ్ళ కొడుకు వచ్చి ఆ ముసలావిడ పనులు పోతే ఆ డబ్బు కట్టించుకుని ప్రాణాలు పోస్తారా అనగా అలా ఇలా చేస్తాం అనడంతో మరి ఆపరేషన్ చేయొచ్చు కదా అని అంటుంది తులసి.
అప్పుడు తులసి హాస్పిటల్ ఎదురుగా కూర్చుని దీక్ష చేస్తూ ఉంటుంది. అప్పుడు తులసి బయట రచ్చ రచ్చ చేస్తుండగా ఇంతలో అక్కడికి రాజ్యలక్ష్మి వస్తుంది. అక్కడే ఉన్న ఒక అతని చంప పగలగొడుతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి సరి కొత్త నాటకం మొదలు పెడుతూ అంతా చూస్తున్నాను అంతా వింటున్నాను డాక్టర్ వృత్తికే కలంకం నీ తెప్పిస్తావా అంటూ ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. మీకు మనిషి ప్రాణాలు కంటే డబ్బు ఎక్కువ ఈ హాస్పిటల్ నాది ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను నువ్వు కాదు. అప్పుడు తులసి రాజ్యలక్ష్మి మాటలు నిజమే అని నమ్ముతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్లి ఆ పేషెంట్ కి ఆపరేషన్ మొదలు పెట్టు అని అంటుంది. అప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ తులసిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడు తులసి సమయానికి వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం అంటూ రాజ్యలక్ష్మి పొగుడుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎవరైనా పేషెంట్ తాలూకా మీరు ఎందుకు వచ్చారు అనడంతో తులసి అసలు నిజం చెప్పబోతుండగా ఇంతలో రాజ్యలక్ష్మి కి కాల్ రావడంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి లోపలికి వెళ్లి మరొకసారి ఆమె ఈ హాస్పిటల్ కి రావడానికి వీల్లేదు ఆమెనే కాదు ఆమె తరపున ఎవరు ఈ హాస్పిటల్ కి రావడానికి వీల్లేదు అని అంటుంది. తను మన శత్రువు అని అంటుంది. మరోవైపు సంజయ్ రాజ్యలక్ష్మి ఇద్దరు జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు.
ఒక అతను అక్కడికి వచ్చి మీరు కరెక్ట్ గా ఆలోచించారు మేడం దివ్య చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది అనడంతో సరే వెళ్లి దివ్యని పంపించండి అని అంటుంది. కంగ్రాట్యులేషన్స్ దివ్య ఈ జాబ్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావు అనడంతో థాంక్స్ అమ్మ అని తులసిని అనుకుంటూ ఉండగా మీ అమ్మ అంటే అంత ఇష్టమా అని అనగా ప్రాణం అని అంటుంది. ఇప్పుడు మీకు థాంక్స్ చెప్తున్నాను మేడం నా టాలెంట్ ని గుర్తించి మీరు నన్ను జాయిన్ చేసుకున్నారు అనడంతో నీ టాలెంట్ నేను గెలిపించింది దివ్య అని అంటాడు. సరే మా హాస్పిటల్ లో పనిచేయాలి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి చెప్తాను విను ఉంటుంది.
పేషెంట్ మీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అనగా అతని ప్రాబ్లం తెలుసుకొని మెడిసిన్స్ రాసి పంపించేస్తాను అంటుంది దివ్య. అలా పంపిస్తే మీకు నెలకి వేళ్లలో లక్షలు జీతాలు ఎవరు ఇస్తారు పేషెంట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నవి లేనివి అన్ని కలిపి నాలుగు ఐదు టెస్టులు రాసి వేలల్లో కుదిరితే లక్షల్లో డబ్బులు గుంజాలి అనడంతో దివ్య షాక్ అవుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఆ పేషెంట్ కి ప్రమాదం ఉంది అని చెప్పి సీన్ క్రియేట్ చేసి వాళ్ళు హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా చేయాలి అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మాటలకు దివ్య షాక్ అవుతుంది. ఇలా చేస్తే పేషెంట్ ని మోసం చేసినట్టు అవుతుంది పేషంట్ మన దగ్గరికి నమ్మకంతో వస్తాడు అలాంటప్పుడు ఇలా చేస్తే ఎలా మేడమ్ అని అంటుంది.
ఒక పేషెంట్ కి డాక్టర్ న్యాయం చేయాలి అలా చేయనప్పుడు నాకు ఈ జాబ్ అక్కర్లేదు నేను ఇక్కడ పని చేయను అని అంటుంది దివ్య. అప్పుడు రాజ్యలక్ష్మి సరికొత్త నాటకం మొదలు పెడుతూ నువ్వు మా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉన్నావో లేదో అని జస్ట్ చిన్న టెస్ట్ చేశాను నువ్వు ఇందులో కూడా పాస్ అయ్యావు దివ్య అని అంటుంది రాజ్యలక్ష్మి. కావాలనే దివ్య కి అబద్ధాలు చెబుతూ ఉంటుంది. దివ్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పేషెంట్ వచ్చిన తర్వాత అన్ని టెస్టులు చేయించి దివ్య దగ్గరికి పంపించండి అని అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఒక కొత్త వ్యక్తి కారులో నుంచి ఎంట్రీ ఇస్తాడు.
