Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో దివ్య పాప కోసం బెలూన్స్ తీసుకొని వచ్చి ఆ తర్వాత రౌడీలకు బుద్ధి చెప్పడానికి వెళుతుంది. మీరే కదా పాప బెలూన్స్ ని కట్ చేసిన హీరోలు మీకు ఆ దేవుడు ఇంటికి వెళ్లే లోపు ఏదో ఒక శిక్ష వేస్తాడు ఇది భగవద్గీతలో చెప్పాడు అనడంతో దివ్య మాటలకు ఆకతాయి కుర్రాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు దివ్య వాళ్లకి తన మాటలతో బుద్ధి చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి వెళ్లి ఆ డాక్టర్ని కలవండి లేదంటే సైకోలు అయిపోతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోవడంతో ఒరేయ్ నా మాటలు నమ్మండి నేను సైకోని కాదు అని ఫన్నీగా అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు తులసి దివ్య కోసం ఎయిర్ పోర్ట్ కి వెళుతుంది.

 తర్వాత నందు లాస్య కూడా దివ్య కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్తారు. ఆ తర్వాత నందు తులసి వాళ్ళు అంతా ఒకచోట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా ఎంతలో దివ్య ఫోన్ చేసి అమ్మ వచ్చాను అని ఎదురుగా నిలబడ్డాను అనగా తులసి పక్కకు చూస్తూ ఉండగా వెంటనే దివ్య అమ్మ నేను దివ్యని మారిపోయాను అని అంటుంది. తులసి ఆనందంతో దివ్యని ప్రేమగా హత్తుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకోసం నువ్వు గంట ముందే వస్తావు అనుకున్నాను అనడంతో వస్తామనుకున్నాను మీకోసం పూజ చేయించడానికి గుడికి వెళ్లాను అంటుంది తులసి. ఆ తరువాత దివ్య,నందు ని ప్రేమగా పలకరిస్తుంది. అప్పుడు లాస్య పలకరిస్తుండగా దివ్య మాత్రం పట్టించుకోకుండా తులసి తోనే ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు నందు చిన్నప్పుడు అది కొని పెట్టు ఇది కొని పెట్టు అని ప్రాణాలు తీసేదానివి ఇప్పుడు ఒకరి ప్రాణాలు పోసే దానివి అయ్యావు ఎంత పెద్ద దానివి అయ్యావు దివ్య అనడంతో మూడేళ్లు మీకు దూరంగా ఉండేసరికి చాలా మిస్ అయ్యాను అని అంటుంది. ఆ తరువాత అందరూ కలిసి కారు దగ్గరికి వెళ్తారు. అప్పుడు లాస్య దివ్యకి నీ మీద ఉన్న ప్రేమ తగ్గలేదు కాదనను కానీ దివ్య స్టేటస్ పెరిగింది బైక్ నుంచి కారుకు వెళ్ళింది అని అంటుంది లాస్య. అప్పుడు తులసి దివ్యని వేరు చేసే విధంగా మాట్లాడుతుంది లాస్య. బయలుదేరుదామా దివ్య అనడంతో బాయ్ నాన్న అని అంటుంది దివ్య.

అదేంటమ్మా లగేజ్ కారు లో పెట్టాను కదా అని లాస్య అనగా మీరు నాన్న తీసుకొని వస్తారు కదా నేను అమ్మ మధ్యలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ బైక్ మీద వస్తాము అనడంతో తులసి లాస్య వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు లాస్య మనం లగేజ్ మోయడానికి తప్ప దేనికి పనికిరామ అనడంతో నాకంటే తనకి తన అమ్మే ఎక్కువ ఎక్కువ చేయొద్దు వెళ్ళిపోదాం పద అని అంటాడు నందు. మరొకవైపు ఇంట్లో అందరూ దివ్య వస్తుంది కదా అని హడావిడి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దివ్య ఇంటికి రావడంతో తులసి హారతి ఇచ్చి లోపలికి రమ్మని పిలవగా అప్పుడు దివ్య లోపలికి వెళ్లి అనసూయ పరంధామయ్యలతో కలిసి చిందులు వేస్తూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు.

అప్పుడు పరంధామయ్య ఆరోగ్యం మీద అందరూ కంప్లైంట్ ఇవ్వడంతో ఏంటి తాతయ్య ఎన్ని కంప్లైంట్స్ అనడంతో అవి చూసి చూడనట్టు వదిలేయాలి అమ్మ అనగా అవన్నీ నాకు కుదరపు మా అమ్మ పాపము అంటుంది కానీ నేను అలా కాదు వెంటపడి మరి వేధిస్తాను అని అంటుంది దివ్య. అప్పుడు దివ్య మాటలకు ఏంటిది ఏదో ఫుల్ పకడ్బందీగా వచ్చినట్టుంది కొంపదీసి నాకు కూడా ఏమన్నా వార్నింగ్ ఇస్తుందా అనడంతో పక్కనే ఉన్న రాములమ్మ అదే ఉండొచ్చామా కానీ నాకు అలా అనిపించడం లేదు అంటూ లాస్య పై సెటైర్లు వేస్తుంది. అప్పుడు రాములమ్మ స్వీట్ తెచ్చి దివ్యకు ఇవ్వడంతో మీరు నాకు స్వీట్లు ఇవ్వడం కాదు నేనే మీకు స్వీట్లు ఇవ్వాలి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మీరు అంటుంది దివ్య. 

అప్పుడు తాతయ్య మీరు తొందరపడి దివ్యతో ట్రీట్మెంట్ చేయించుకోకండి అది చదివి పాస్ అయిందో లేఖ కాపీ కొట్టి పాస్ అయిందో అని అంటుంది అంటాడు ప్రేమ్. అప్పుడు ప్రేమ్ దివ్య పరిగెత్తిస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత దివ్య కి గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా నాకు కూడా పెట్టమ్మా అని అంటాడు ప్రేమ్. అప్పుడు దివ్య మూడేళ్ల పాటు నేను పెద్దన్నయ్య లేము కదా ఆ ప్రేమ అంతా నువ్వే పొందావు కదా ఒక మూడేళ్ల పాటు నువ్వు రాకు పో అని అంటుంది దివ్య. మూడేళ్లు ఉన్న నాకు నచ్చినవి ఏది అమ్మ చేసి పెట్టలేదు నువ్వు రాగానే నీకోసం అని చేసి పెట్టింది అని అంటాడు ప్రేమ్.

అప్పుడు ప్రేమ్ దివ్యని ఆటపట్టిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అభి అంకితలకు వీడియో కాల్ చేస్తారు. అప్పుడు అందరూ భోజనం చేస్తూ అది వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అంకిత వాళ్ళు వీడియో కాల్ చేయడంతో అభి దివ్య మీద సెటైర్లు వేస్తూ ఉండగా అంకిత వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు నీ ఫీచర్ ప్లానింగ్స్ ఏంటి అని అది దివ్యని అడగడంతో అమ్మ చెప్పినట్టు మొదట్లో చిన్న క్లినిక్ పెట్టి తక్కువ ఖర్చులోనే పేద వాళ్ళకి వైద్యం చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది.