బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాదిలో ఆ తరహాలో వుండే ఓ క్రేజీ ప్రాజెక్టు ప్లాన్ చేశారు తమిళ దర్శకుడు సుందర్. తమిళంలో భారీస్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రమే సంఘమిత్ర. ఈ చిత్రంపై ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రంలో శృతిహాసన్ నటించాల్సింది. కానీ చిత్ర యూనిట్ తో విభేదాలు రావడంతో శృతి హాసన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకుని షాక్ ఇచ్చింది. శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న తరువాత చాలా మంది హీరోయిన్లని పరిశీలించి చివరకు మెరుపు తీగ దిశా పటానిని ఎంపిక చేసారు. శృతి హాసన్, చిత్ర యూనిట్ కు తలెత్తిన విభేదాల గురించి దిశాని అడగగా ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

 

సంఘమిత్ర చిత్రం యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు.  శృతి హాసన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ తో తలెత్తిన విభేదాల వలన శృతీహాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇంతటి క్రేజీ మూవీ నుంచి శృతి తప్పుకోవడంతో సినీవర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది.

 

శృతి హాసన్ తప్పుకోవడంతో చిత్ర యూనిట్ పలువురు హీరోయిన్లని పరిశీలించింది. చివరకు దిశా పటానిని ఎంపిక చేయడం విశేషం. అనుకోకుండా ఈ క్రేజీ చిత్రంలో అవకాశం రావడంతో ఈ అందాల మెరుపుతీగ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. ఊహించని విధంగా దిశా పటానికి సంఘమిత్ర చిత్రంలో నటించే అవకాశం రావడంతో మీడియా ఫోకస్ ఆమెపై పడింది.

 

శృతి హాసన్ ని రీప్లేస్ చేయటం ఎలా అనిపిస్తుంది అని ఆగడగా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ని రీప్లేస్ చేయటానికి నేను ఎవరిని అంటూ దిశా సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ నాకన్నా సీనియర్ నటి. ఆమెతో పోల్చుకుంటే నేను నటించిన చిత్రాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నేను శృతి హాసన్ ని రీప్లేస్ చేయడం ఏంటి అని ప్రశ్నించింది. చిత్ర యూనిట్ కి, శృతి హాసన్ కు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కనీసం నేను అడగలేదు. మీకు తెలుసుకోవాలని ఉంటే వెళ్లి డైరెక్టర్ ని అడుక్కోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

 

దిశా పటాని ప్రస్తుతం బాఘీ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. మార్చి 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తరువాత నుంచి దిశా పటాని సంఘమిత్ర షూట్ లో పాల్గొంటుంది.