డైరెక్టర్ మాట విని.. రిస్క్ లో పడ్డ హీరోయిన్!

Disha Patani Injures Her Knee While Rehearsing For Salman Khan's Bharat
Highlights

దర్శకుడు పెర్ఫెక్ట్ గా రావాలని చెప్పడంతో.. శృతి మించి ఆమె ప్రాక్టీస్ చేసిందని ఆ కారణంగానే ఇలా జరిగిందని దిశా సన్నిహితులు అంటున్నారు. తదుపరి షెడ్యూల్ మొత్తం కూడా దిశా సీన్లే షూటింగ్ చేయాల్సి ఉండడంతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశాపటాని.. వెంటనే బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరుస అవకాశాలు రావడంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. రీసెంట్ గా ఆమెకు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'భరత్' అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది.

పాత్ర ప్రకారం సినిమాలో దిశా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించాల్సివుంది. గతంలో ఆమె యాక్షన్ సీన్స్ కోసం శిక్షణ తీసుకోవడంతో ఈ సినిమాలో డూప్ లేకుండా తనే  రిస్కీ షాట్స్ లో నటిస్తానని చెప్పింది. దర్శకుడు కూడా ఆమెను ప్రోత్సహించడంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె కాలికి విపరీతంగా దెబ్బలు తగిలాయి.

దర్శకుడు పెర్ఫెక్ట్ గా రావాలని చెప్పడంతో.. శృతి మించి ఆమె ప్రాక్టీస్ చేసిందని ఆ కారణంగానే ఇలా జరిగిందని దిశా సన్నిహితులు అంటున్నారు. తదుపరి షెడ్యూల్ మొత్తం కూడా దిశా సీన్లే షూటింగ్ చేయాల్సి ఉండడంతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader