ఈ మధ్యకాలంలో దర్శకులకు, సినిమాటోగ్రాఫర్లకు మధ్య పొంతన లేకపోవడం ఎక్కువగా గమినిస్తూ ఉన్నాం. ముందు సినిమాలు అంగీకరించడం తరువాత ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయే సినిమాటోగ్రాఫర్ల సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమాకు 'భరత్ అనే నేను' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు రవి కె చంద్రన్ ను సినిమాటోగ్రాఫర్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా కొరటాలకు, రవి చంద్రన్ కు మధ్య డిఫరెన్సెస్ రావడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొరటాల డైరెక్ట్ చేసిన 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. ముందుగా మాథి సినిమాటోగ్రాఫర్ గా ఉండేవాడు. కానీ అతడు తప్పుకోవడంతో ఆ స్థానంలో తిరు వచ్చి చేరాడు.

ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా తిరుని తీసుకోవాలని భావిస్తున్నాడు కొరటాల శివ. ఈ రీప్లేస్మెంట్ కారణంగా ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా షూటింగ్ కు సరైన సమయానికి హాజరు కాకపోవడం, ఆయన కారణంగా షూటింగ్ వాయిదా పడడం వంటివి జరుగుతున్నట్లు సమాచారం. ఈ రెండు కారణాల వలన మహేష్ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి. 

 

ఫిల్మ్ నగర్ కబుర్లు

'సై.. రా' విషయంలో అతడికే ఓటు!

https://goo.gl/iSWh2u

‘మళ్లీ రావా’ కలెక్షన్లు చాలా పూర్ గురూ!

https://goo.gl/1kg7Wd