రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాథ పాత్రలో మెప్పించిన కాజల్ వరుస ఆఫర్లతో మళ్లీ దూసుకెళ్తున్న కాజల్ కు తేజ మరో ఆఫర్

లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చందమామ కాజల్ ఇప్పుడు దశాబ్దం తర్వాత సౌత్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించింది. ఖైదీనెంబర్ 150కి ముందు కాజల్ కెరీర్ అయిపోయిందని అనిపించినా మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో కాజల్ మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల రానా సరసన నేనేరాజు నేనే మంత్రి సినిమాలో రాధమ్మగా నటించి హిట్ కొట్టిన కాజల్.. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టులు ఓకే చేసిందని తెలుస్తోంది. వాటిలో తనని వెండితెరకు పరిచయం చేసిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ తో రాబోయే సినిమా కావడం విశేషం. లక్ష్మి కళ్యాణం తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించిన కాజల్ తేజ డైరక్షన్ లో ముచ్చటగా మూడో ఛాన్స్ కూడా పట్టేసింది. తేజ దగ్గర ఓనమాలు దిద్దించుకున్న ఈ చందమామ మళ్లీ ఇప్పుడు స్టార్ అయ్యాక అతని డైరక్షన్ లో చేయడం గొప్ప విషయమని చెప్పాలి.

ప్రస్తుతం తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ కు స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈలోగా వెంకటేష్ సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్ తో ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. కాజల్ తో వెంకటేష్ రొమాన్స్ చేయడం కూడా ఇదే మొదటిసారి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి తేజ మాత్రం కాజల్ ని వదిలేదే లేదంటున్నాడు.