తేజ, బాలయ్య మళ్ళీ కలుస్తున్నారా..?

First Published 12, May 2018, 6:30 PM IST
director teja is back to ntr biopic
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బాలకృష్ణ 'ఎన్టీఅర్' బయోపిక్

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో బాలకృష్ణ 'ఎన్టీఅర్' బయోపిక్ చేయాలనుకున్నాడు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నెలలుగా పని చేసిన దర్శకుడు తేజ సడెన్ గా బయటకు వచ్చేసాడు. అతడికి బదులుగా మరో దర్శకుడిని తీసుకోవాలని భావించిన చిత్రబృండానికి నిరాశే ఎదురైంది. చివరకు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వ పర్యవేక్షణలో బాలకృష్ణ డైరెక్టర్ గా ఈ సినిమాను రూపొందించనున్నాడని అన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు తేజ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కు పని చేయనున్నారని సమాచారం. కేవలంలో ఈగో సమస్యల కారణంగా బయటకు వెళ్ళిన తేజకు, బాలయ్యకు మధ్య రాయబారాలు నడిచాయని కొందరు సన్నిహితులు వీరి మధ్య సమస్యలు పరిష్కరించారని తెలుస్తోంది. దీంతో తేజ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ లోకి ఎంటర్ అయ్యాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. తేజ డైరెక్టర్ గా సినిమా చేస్తే మాత్రం అది మంచి విషయమనే చెప్పాలి. ఇన్నాళ్ళపాటు స్క్రిప్ట్ కోసం వర్క్ చేసిన తేజ అయితేనే ఈ సినిమాకు బెస్ట్ ఆప్షన్. 

loader