ఆ సినిమా నష్టాన్ని భరించిన శ్రీనువైట్ల

Director Srinu Vaitla Pay rs 85 Lakh to Mister Movie Producers
Highlights

  • వరుస ప్లాపులతో వెనుకపడిపోయిన డైరెక్టర్ శ్రీనువైట్ల
  • మిష్టర్ సినిమా నష్టాన్ని భరించిన శ్రీనువైట్ల
  • రవితేజతో సినిమా తీసే అవకాశం చేజిక్కించుకున్న శ్రీనువైట్ల

అగ్రహీరోలకు వరుస బ్లాక్‌బస్టర్లను అందించిన దర్శకుడు శ్రీనువైట్ల. ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు వెక్కిరించడంతో రేసులో వెనుకపడ్డాడు.  తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిష్టర్ చిత్రం కూడా ఆయనకు నిరాశను మిగిల్చింది. ఆ చిత్రం భారీ నష్టాల్లో కూరుకూపోవడంతో ఆయన ఆ నష్టాల్ని కొంత భరించాల్సి వచ్చింది. ఈ అంశంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు టాలీవుడ్ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి వివాదాన్ని పరిష్కరించినట్టు సమాచారం.

 

శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మిష్టర్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బక్సాఫీసు వద్ద  చతికిల పడింది. దీంతో  ఊహించని విధంగా భారీగా నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ నష్టాలను శ్రీను వైట్ల షేర్ చేసుకోవాలంటూ చిత్ర నిర్మాతలు గత కొంతకాలంగా ఆయనను డిమాండ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రూ.85 లక్షలు ఇవ్వడానికి శ్రీను వైట్ల అంగీకరించినట్లు సమాచారం. మిష్టర్ సినిమా నష్టాన్ని  ఈ రూ.85లక్షలు కొంతమేర కూడా పూడ్చవని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే శ్రీను వైట్ల చాలా ఇబ్బందుల్లో ఉండటంతో.. ఆ డబ్బును తీసుకోవడానికి నిర్మాతలు అంగీకరించారు.

 

ఈ అంశంపై టాలీవుడ్‌ ప్రముఖులు తలో విధంగా స్పందించినట్టు తెలిసింది. నిర్మాతలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టించే దర్శకులకు శ్రీను వైట్ల ఉదంతం ఓ గుణపాఠం  అవుతుందని కొందరు భావించారు. మరికొందరేమో బ్లాక్ బస్టర్లు అందించినప్పుడు అధికంగా  అధిక పారితోషికం, లాభాలు చెల్లించనప్పుడు నష్టాలు వస్తే మాత్రం ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు.

 

ఇక ఈ విషంయ పక్కన పెడితే.. ప్రస్తుతం శ్రీను వైట్లకు రవితేజతో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. మొదటి నుంచి శ్రీనువైట్ల, రవితేజ  మంచి మిత్రులు. అందుకే.. రవితేజ ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

loader