సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సర్కార్ లాంటి భారీ విజయం తర్వాత మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దర్బార్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

రజనీ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రజనీకి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండడం విశేషం.సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 

చిత్ర దర్శకుడు మురుగదాస్ దర్బార్ షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని వివరించారు. సన్నివేశంలో భాగంగా రజనీకాంత్ కుర్చీని దూరంగా విసిరి కొట్టాలి. కానీ కుర్చీ బరువేమో ఎక్కువగా ఉంది. అప్పటికప్పుడు తేలికైన కుర్చీని తీసుకురావడం వీలు కాలేదు. అలాంటి సమయంలో రజనీకాంత్ స్వయంగా.. కుర్చీని ఎంత దూరంలో విసిరేయాలి అని అడిగారు. కెమెరా ముందు పడాలి సర్ అని చెప్పాను. 

బంపర్ ఆఫర్.. మెగాస్టార్ తో డైరెక్టర్ తేజ సినిమా?

ఆ షాట్ ని బరువైన కుర్చీతో రజని కేవలం 2 టేక్స్ లో పూర్తి చేశారు. రజనీకాంత్ ఎనర్జీ లెవెల్స్ కు తాను ఆశ్చర్యపోయానని మురుగదాస్ అన్నారు. రజనికి వయసైపోయింది అని చాలా మంది కామెంట్స్ చేస్తుండడం వింటూనే ఉన్నాం. ఎన్ని కామెంట్స్ చేసినా రజనీ మనల్ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు అని మురుగదాస్ అన్నారు. 

లైకా ప్రొడక్షన్స్ సంస్థ దర్బార్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.