భార్యకి క్రిష్ విడాకులు.. కారణమదేనా?

Director Krish and his wife head for a divorce
Highlights

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు క్రిష్

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు క్రిష్. ప్రస్తుతం బాలీవుడ్ లో 'మణికర్ణిక' సినిమాను రూపొందిస్తోన్న ఈ దర్శకుడు త్వరలోనే తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. గతేడాది రమ్య అనే డాక్టర్ ను వివాహం చేసుకున్న క్రిష్ కొన్ని కారణాల వలన ఆమె నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నారట.

బయటకు తమ మధ్య ఎలాంటివిబేధాలు లేవని చెబుతున్నప్పటికీ క్రిష్ కి మరొక వ్యక్తితో సంబంధం ఉన్న కారణంగానే రమ్య అతడికి దూరం అవ్వాలని డిసైడ్ అయినట్లు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తన భర్తను వెతుక్కుంటూ ముంబైకి వెళ్లిన రమ్య అతడు మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక విడాకులకు అప్లై చేస్తుందని టాక్. రమ్య ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ నుండి క్రిష్ కు సంబంధించిన ఫొటోలన్నీ కూడా డిలీట్ చేసేసింది.

పరస్పర అంగీకారంతో విడాకుల ఒప్పందానికి దరఖాస్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ జంట ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. 

loader