Asianet News TeluguAsianet News Telugu

శాండీ హీరోగా జార్జి రెడ్డి జీవితం ఆధారంగా సినిమా

  • విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జి రెడ్డి కథ ఆధారంగా సినిమా
  • వంగవీటి సినిమా హీరో శాండీ కథానాయకుడిగా సినిమా
  • ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి

 

director jeevan reddy planning movie on student george reddy with sandy

వంగవీటి సినిమా హీరో సాండి, దళం దర్శకుడు జీవన్ రెడ్డి, ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా ‘సాయిరాత్’ కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది.

 

‘వంగవీటి’  సినిమా కథానాయకుడు సాండీ జార్జ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు.దళం జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ   చేస్తాం. 1962 నుంచి 1972 సంవత్సరాల్లో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్  కంప్లీట్ అయ్యింది.

 

హైదరాబాద్, వరంగల్, కేరళ, ఔరంగాబాద్, ముంబాయి, పూణె లో ఈ సినిమా చిత్రీకరణ ప్లాన్చేస్తున్నాం.  భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మళయాల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను రెండు ప్రధాన నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల  చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios