దిల్ రాజు నుండి మరో మల్టీస్టారర్!

Director Indraganti Mohana Krishna’s next is a multistarrer under Dil Raju’s banner
Highlights

 తాజాగా నిర్మాత దిల్ రాజు మరో మల్టీస్టారర్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుండే మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆ తరువాత మాత్రం మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. అలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లను హీరోలుగా పెట్టి దిల్ రాజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమాను రూపొందించాడు.

ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో టాలీవుడ్ లో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగింది. ఈ ఏడాదిలో వెంకీ-చైతు కాంబినేషన్ లో 'వెంకీ మామ', అలానే వెంకీ-వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో 'ఎఫ్2' సినిమాలు చిత్రీకరణకు సిద్ధమయ్యాయి. అలానే ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి మరో మల్టీస్టారర్ లో నటించబోతున్నారు. తాజాగా నిర్మాత దిల్ రాజు మరో మల్టీస్టారర్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. నటీనటులను ఎంపిక చేసి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

loader